అన్నీ భగవద్దత్తమని గుర్తిస్తే ఈశ్వర దర్శనం.
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
ప్రతి మానవుని రూపంలోనూ, భూమి మీద గల ప్రతి జీవిలోనూ, అంతెందుకు సృష్టిలోని ప్రతి పరమాణువులోనూ, భగవంతుడుంటా డనేది నిస్సంశయం. కాని భ్రమతో మనం భగవంతుడు సర్వ వ్యాపి అని స్థిరంగా భావించని కారణం చేత ప్రత్యక్షంగా దేవాలయాలకు పవిత్రతనారోపించి దేవుడు అక్కడే ఉంటాడని భావిస్తుంటాం. సముద్రమనే పాత్రలో నీలగిరి అంత సిరా ఉండి కల్పవృక్షపు కొమ్మ అనే కలంతో భూమి అనే కాగితంపై ఆ సరస్వతీ దేవియే కలకాలం రాసినా ఈశ్వరుని మహిమాభివర్ణనం పూర్తి కాజాలదు.
హృదయం కంటే అధికుడైన ప్రబోధకుడు, కాలం కంటే ముఖ్యమైన గురువూ, ప్రపంచం కంటే ఉత్తమమైన పుస్తకం, భగవంతుని కంటే ప్రియమైన స్నేహితుడు లేరని సూక్తి. 'స ఈశ: అనిర్వచనీయ ప్రేమ స్వరూప:' అని అంటారు. ఆ దేవుడు ఇట్టివాడని వర్ణించి చెప్పలేని ప్రేమయే స్వరూపంగా గలవాడు. అంతేకాదు 'స ప్రత్యక్ష సర్వేషాం ప్రేమ రూప: అన్ని జీవుల యందు ప్రేమ రూపంలో ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉంటా డు. అలాంటి ఈశ్వరుని దర్శనం కోసం దేవాలయాలకు వెళ్ల డం వలన మనమేమైనా లాభం పొందుతున్నామా, లేదా అనేది మన మనో వైఖరిని బట్టి ఉంటుంది. వినయంతో, పశ్చా త్తప్త హృదయంతో మనం దేవాలయాలకు వెళ్ళాలి. ప్రతి మాన వుని రూపంలోనూ, భూమి మీద గల ప్రతి జీవిలోనూ, అంతెందుకు సృష్టిలోని ప్రతి పరమాణువులోనూ, భగవంతు డుంటాడనేది నిస్సంశయం. కాని భ్రమతో మనం భగవం తుడు సర్వ వ్యాపి అని స్థిరంగా భావించని కారణం చేత ప్రత్యక్షంగా దేవాలయాలకు పవిత్రతనారోపించి దేవుడు అక్కడే ఉంటాడని భావిస్తుంటాం. సముద్రమనే పాత్రలో నీలగిరి అంత సిరా ఉండి కల్పవృక్షపు కొమ్మ అనే కలంతో భూమి అనే కాగితంపై ఆ సరస్వతీ దేవియే కలకాలం రాసినా ఈశ్వరుని మహిమాభివర్ణనం పూర్తి కాజాలదు. అట్టి భగ వంతునిపై మనకు విశ్వాసం ఉండాలి. అంతేకాని దేహాసక్తి, భయం ఉన్నంతవరకూ మనకు నిజమైన రక్షణ లేదు. నిద్ర వచ్చి కన్ను మూతపడితే దొంగలెక్కడ కొడతారో, పాము ఎక్కడ కాటు వేస్తుందో అన్న భయమే కలత పెడుతుంది.
మనిషి తల కింద కర్ర పెట్టుకుని నిద్రపోతుంటాడు. ఇది ఎందుకని అడిగితే 'దగ్గర ఏదైనా ఆయుధం ఉంచుకోవడం మంచిది. దొంగలు వస్తే ఏం చేయాలి?' అంటాడు. వెర్రివాడు కాకపోతే వచ్చిన దొంగలు కర్ర తెచ్చుకోవడం ఎక్కడ మరిచిపోతారో అని ముందే దానిని సిద్ధపరచి ఉంచేడన్న మాట. దొంగలు ఆ కర్రతోనే ఆ మనిషి తల మీద కొడితే ఏమవుతుంది? మనం ఎవరి మీద భారముంచి నిద్రపోతున్నాం? నిద్ర పోయేటప్పుడు మనం ప్రపంచం ఒడిలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనల్ని మనం రక్షించుకుంటున్నాం అంటే అది మెలకువగా ఉన్నప్పుడే కదా! నిద్రలో మనల్ని రక్షించేవాడు ఎవరు, ఆ భగవంతుడు తప్ప. మనం లోకంలోని మత సంస్థలన్నిటిని నమ్ముతుండవచ్చు. ఇంత వరకూ రచింపబడ్డ్డ మత గ్రంథాలన్నిటినీ మన మస్తిష్కంలో మోస్తూండవచ్చు. భూమి మీద ప్రవహిస్తున్న నదులన్నిటిలో అఘమర్షణ స్నానం చేసిి ఉండవచ్చు. కాని మనం ఈశ్వర దర్శనం పొందకుంటే ప్రయోజనం లేదు. ఒకడు దేవాల యానికి ఎప్పుడూ వెళ్లి ఉండకపోవచ్చు. కాని అతడు తన మనసులో భగవంతుని ఉనికిని గుర్తించి ఆ సత్యానికి కట్టు బడితే అతడు మహాత్ముడే. జగదీశ్వరుడైన విశ్వాత్మతో మనకు తాదాత్మ్యం కలిగించే జ్ఞానమే యథార్థ జ్ఞానం. భగవంతుని సాక్షాత్కారానికి సహాయపడే విద్యయే పరమోత్కృష్టమైన విద్య. పరావిద్య.
పిత్రార్జితమైన భూమిని అన్నదమ్ములు కొలుచుకుని పంచుకుంటూ 'ఈ స్థలం నాది, ఆ స్థలం నీది' అని తగవులా డుకుంటుంటే చూసి భగవంతుడు నవ్వుకుంటాడట.
ఈ భూమి మీద ప్రతి అంగుళం నా సృష్టేనని గుర్తిం చలేకుండా ఉన్నారు అని అనుకుంటాడట. అలాగే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల శక్తులు మన ప్రజ్ఞ వలన కలిగినవి కావని, అవి భగవద్ద్దత్తమైనవని గుర్తించిన నాడు మనకు నిజంగా ఈశ్వర దర్శనం కలిగినట్లే. మన మనసునూ, వాక్కునూ, కర్మనూ, ఈశ్వరునికి అంకితం చేసి అర్పించిన నాడు మనకు తప్పకుండా ఈశ్వర దర్శనం కలుగుతుంది. అందుకు మనలను మనం సన్నద్ధులుగా చేసుకోవాలి.
留言