మాతృ హృదయ వేదన
- B Ashok Kumar
- Jun 3, 2018
- 2 min read
Updated: Jun 5, 2018
కైకేయి పన్నాగం తెలియని కౌసల్య రామునికి శుభం చేకూ రాలని వ్రత నియతయై పూజలు చేస్తున్నది. కౌసల్య రాముని ఆలింగనం చేసుకుని మార్థాన్ని మూర్కొని అశీర్వదించింది. రాముడు మెల్లగా కైకేయి కోరిన వరాలు రెండింటిని తెలిపాడు. తండ్రి నిర్ణయాన్ని తెలిపాడు. పితృవాక్య పాలనకై కందమూల ఫలాలను తింటూ జడధారియై పద్నాలుగేళ్ళు వనవాసం చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. కౌసల్య ఆనందం ఆవిరి అయిపోయింది. ఆ మాటలు ఆమె పాలిటి పిడుగుపాటు అయింది. ఆమె నేల వాలిపోయింది. రాముడు ప్రేమతో తల్లి శరీరాన్ని నిమురుతూ మెల్లగా ఉపశమింపజేశాడు. కౌసల్య తన కొడుకు కష్టాలకు తన దురదృష్టమే కారణమని తనను తాను నిం దించుకున్నది. పట్ట్టమహిషి అయినా సవతి చీద రింపులతో నికృష్టంగా జీవించింది. కొడుకు పట్టాభిషిక్తుడయితే రాజమాతగా సగౌరవంగా జీవింపగలను అని ఆశించింది. ఆమె ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. కేవలం తన కడుపున పుట్టి నందునే రాముడు దిక్కులేనివాడై అడవులపాలు అవుతున్నాడే అని విలపించింది. భరతుడు పట్ట్టాభిషి క్తుడ యితే తన ఉనికి కైకేయి ఎదుట ఏ విధంగా ఉంటుంది. ఇక తన బతుకు దాసి బతుకు కన్న హీనమే కదా! అని చింతించింది. 'రామా! కానుక కన్న సంతానం నీవు ఒక్కడివే . నీవు కూడా అడ వుల పాల యితే ఇక నాకు మర ణమే శరణ్యం' అని భోరున ఏడ్చింది. కౌసల్య మనో వేదన చూసి లక్ష్మ ణుడు, 'అమ్మా! వృద్ధుడైన మహా రాజు కోరికల తో కైకేయి వశమయ్యాడు. కామా తురు ని బుద్ధి వికటించకుండునా? కైకేయి చేతిలో కీలు బొమ్మవలె అడుతున్నాడు. నిరప రాధి అయిన పెద్ద కొడుకును అడ వుల పాలు చేపే పాషాణ హృద యుడైన కన్న తండ్రి లోకంలో ఎవడైనా ఉన్నాడా? విచక్షణా రహితుడై ఈ అకార్యా నికి పూనుకు న్నాడు. అటు వంటి తండ్రి మాట లను ఏ కొడుకైనా ఎందుకు పాటించాలి? అన్నాడు. అనంతరం రాముని చూసి, 'అన్నా! ధనుర్ధారియై అన్నీ నేను చక్కబెడ తాను. వంశ ధర్మాన్ని అనుసరించి రాజ్యాధికారం పెద్ద కొడకుదే! దీన్ని ఒకరు ఇవ్వాల్సిన పని ఏముంది? రాజు స్త్రీలోలుడై, ఉన్మాదియై, కార్యాకార్య విచక్షణ కోల్పోయినపుడు అతడు దండనార్హుడే! తండ్రి అయినా ఋజుమార్గాన్ని వీడి, కపట వర్తనుల దుష్ట పన్నాగాలకు వశుడై అకార్యాలు చేస్తున్నపుడు రాజ్య రక్షణకై అతడు వధార్హుడే! నీవు అనుమతినిస్తే కైకేయీ, దశరథులు ఇద్ద్దరినీ వధించి రాజ్యాన్ని నిష్కంటకం చేస్తాను. భరతుని అభిమానులు ఎదురు తిరిగితే వారి భరతం పడతాను' అన్నాడు. అంతేకాక 'అమ్మా! రాముడు నాకు ప్రాణ సమానుడు. అన్న అగ్నిలో దూకినా, అడవికి పోయినా, ఈ లక్ష్మణుడు ముందు ఉంటాడు. ఉదయించే సూర్యుడు చీకటిని రూపుమాపినట్లు, నా పరాక్రమాన్ని ప్రదర్శించి నీ దు:ఖాన్ని రూపుమాపుతాను' అన్నా డు. కౌసల్య, రాముని చూసి, 'రామా, నీ తమ్ముని మాటలు విన్నా వు కదా! నీవు ధర్మ జ్ఞుడివి. కన్నతల్లిని విడిచి పోవడం నీకు తగునా? నీవు నిజంగా ధర్మ వర్తనుడవయితే నన్ను సేవించు. మాతృసేవ ధర్మాలలో ఉత్తమమైనదని వేరొకరునీకు చెప్పాలా? నీవు నన్ను విడిచివెళితే ప్రాయోపవేశం ద్వారా ప్రాణం విడువడం తప్ప నాకు గత్యంతరం లేదు!', అని విలపించింది. రాముడు, తల్లి మాటలు విని, 'అమ్మా! పితృవాక్య పరిపాలన పుత్రుని కర్తవ్యం. ధర్మాధర్మాల విచికిత్స చేయన క్కర్లేదు. దీనిికి పూర్వోదాహరణ వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. పిత్రాజ్ఞను పాటించే కండు మహర్షి గో హత్యచేశాడు. సగరుని కొడుకులు భూమిని తవ్వి దుర్మరణం పాలయ్యారు. పరశురాముడు తల్లి రేణుకను వధించాడు. తండ్రి మాట పాటించడం మన సంప్ర దాయం. ఇప్పుడు నేను కొత్తగా పాటించలేదు. తండ్రి ఆజ్ఞను శిరసాంచటమే కొడుకు ప్రథమ కర్తవ్యం' అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణుని చూసి 'లక్ష్మణా కన్నతల్లి కడుపు తీపితొ పుత్ర వియోగ దు:ఖాన్ని సహింపలేక వివశురాలయింది. యుక్తా యుక్త జ్ఞానాన్ని కోల్పోయింది. తండ్రి మాట తిరస్కరింపుము అంటున్నది. అన్నీ తెలిసిన నీవు ఇట్లు మాట్లాడతగునా? సత్యానికి ధర్మమే ఆధారం ! పురుషార్థాలలో మొదటిది ధర్మమే! తండ్రి సత్య సంధతను కాపాడడమే పుత్రుని కర్తవ్యం. తండ్రినైనా వధించ వలసినదేనన్న నీ మాట ఉచితం కాదు. ఇందులో కైకేయి దోషం ఏముంది? మన తండ్రి ఇచ్చిన వరాలనే ఆమె కోరింది. తండ్రి ఆమెకు ఇచ్చిన మాట పాటించటమే నా ధర్మం. వనవాసానికి వెళ్లడమే నా దృఢ నిశ్చయం!' అన్నాడు.
Comentários