దిగిరాని దశరథ సతి
- B Ashok Kumar
- Jun 3, 2018
- 2 min read
Updated: Jun 5, 2018
దశరథుని వేడికోలు కొనసాగింది. 'ఇన్నాళ్లు నీవు ప్రేమమూర్తివని భ్రమ పడ్డాను. ఇప్పుడు నిజం గ్రహిం చాను. నీవు పయోవిషకుంభమని తెలుసు కున్నాను. నీ మెరమెప్పు మాటలకు మురిసి, కౌసల్యాది భార్యలందరినీ నిర్లక్ష్యం చేశాను. నీవే లోకం అనే భ్రమలో నీ చుట్టూ తిరుగుతూ గడిపాను. ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది. ఇది స్వయంకృతాపరాధమే! నీపై మోజుతో నిన్ను నెత్త్తి మీద పెట్టుకున్నందుకు నన్ను నట్టేట ముంచావు కదే! నీవు నా పాలిట ఉరిత్రాడు అయ్యావు కదే! నన్ను కబళించడానికి దరి చేరిన మృత్యువు అని తెలియక నిన్ను కౌగలించుకున్నానే! తండ్రీ! అడవులకు పో నాయనా! అనగానే రాముడు సరే అంటాడు. నన్ను, నా మాటను తిరస్కరిస్తే ఎంత బాగుంటుంది. కాని నా రాముడు, కాదు అనడే! వెంటనే అడవులకు వెళతాడు. అతడు అటు వెళ్లగానే ఇదంతా ఆ కామాంధుని నిర్వాకమే అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. దుమ్మెత్తి పోస్తారు కదే! కుటుంబాన్ని అంతటినీ నరక యాతన పాలు చేసి, వైధవ్యాన్ని పొంది నీవేమి సుఖపడతావే! రఘువంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావు. నీవు అపకీర్తి పాలవు తావు. నీ మూలంగా అపకీర్తి, అవమానం, మరణం నాకు తప్పవు. స్త్రీలు స్వార్థ పూరితులు అనే నానుడి నీ విషయంలో సార్థకమయింది. నేను రాముని వనవా సానికి బాధపడుతూ ఉంటే, ఈటెల వంటి మాటలతో నా గుండెను తూట్లు పొడుసు ్తన్నావు కదే! ఈ దారుణమైన పనికి నేను ఒడికట్ట్టలేనే! నన్ను మన్నింపవే! రెండో వరాన్ని వదలుకోవే!' అని దశరథుడు కైకేయి పాదాలకు నమస్కరించ బోయాడు. ఆమె తన పాదాలను దూరంగా జరిపింది. నమస్కరించ డానికై వంగిన దశరథుడు అట్లే స్పృహ కోల్పోయి నేలపడి పోయాడు. పుండు మీద కారం చల్ల్లినట్టు కైకేయి, 'రాజా! సత్యవ్రతుడను అని గొప్పలు చెప్పుకుం టుంటావే, మరి ఇప్పుడు నాకు ఇచ్చిన మాటను నెరవేర్చ డానికి వెనుకా డుతున్నా వేమి?' అని హుంక రించింది. పుత్ర సంతానం కోసం వగచి వగచి చివరకు పుత్ర కామేష్టి చేసి, పూర్వ జన్మ పుణ్య విశేషం వల్ల పొందిన పె ద్ద కొడుకును కష్టాల పాలు చేయవలసిందేనా? అని విలపిస్తూ ఉండగానే దశరథుని దు:ఖాన్ని చూడ లేక సూర్యుడు అస్తమించాడు. దశరథునికి ఏడ్చి, ఏడ్చి ఓపిక నశించింది. నోట మాట పెగలడం లేదు. ఎలాగో శక్తినంతా కూడదీసుకుని, 'దయ చూడవే! రాముని కష్టాల పాలు చేయవద్దు' అని బ్రతిమాలాడు. ఆ కఠినాత్మురాలి మనసు కరగలేదు. దయా దాక్షిణ్యాలు లేకుండా ఈసడించుకున్నది. రాముని వనవాసానికి పంపాల్సిందే అని చెవిలో జోరీగ వలె రొద చేసింది. చచ్చిన పామును మరల మరల కొట్టినట్లు పరితాపతప్తుడైన దశరథుని హృదయాన్ని మాటిమాటికి గాయపరిచింది. వేకువ జామున వైతాళికులు పాడే వైతాళిక గీతాలను దశరథుడు వినలేక పోయాడు. వాటిని ఆపుమని అజ్ఞాపించాడు. కైకేయి సతాయించడం ఆపలేదు. ఆమె మాటలు కర్ణకఠోరమై దశరథుని బాధపెడుతున్నాయి. అయినా ఆమె ఏ మాత్రం కనికరం చూపక, 'రాజా! ఏదో పాపం చేసిన వాని వలె బాధపడుతూ నేలపై దొర్లుతున్నావేమి? నీవు నాకు వరాలను ఇవ్వడం సత్యమే కదా! సత్యాన్ని పాటింపుము. వంశ ధర్మాన్ని నిలుపుము అని మాత్రమే నేను కోరుతున్నాను. ఇచ్చిన మాట కోసం డేగకు తన శరీరాన్ని అర్పించిన శిబిని, నేత్రదానం చేసిన అలర్కుని, చెలియలికట్ట దాటని సముద్రుని చరితములను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో! నీవు సజ్జనుడవు, ధర్మజ్ఞుడవు, సత్యవ్రతుడవు అయితే వెంటనే రాముని వనవాసానికి పంపుము. ఇదే నా చివరి మాట! నీవు ఉపేక్షిస్తే నీ ముందే ప్రాణాలు విడుస్తాను' అని కైకేయి ఒత్త్తిడి చేస్తుంటే, దశరథుని ప్రాణం గిలగిల కొట్టుకుంది. 'పాపాత్మురాలా! నిన్నూ, నీ కొడు కునూ త్యజిస్తున్నాను. రాముని పట్ట్టాభి షేకానికి అడ్డు వస్తే నా మరణం తథ్యం. నా అంత్యక్రియలు చేయడానికి అర్హుడు రాముడు మాత్రమే! నీకు నీ కొడుకునకు ఏమాత్రం హక్కులేదు. తెల్లవారితే అభిషేకానికి సిద్ధమై రాబోయే వసిష్ఠాదులకు నా ముఖం ఎలా చూపగలను? ఏమని చెప్పగలను?' అని దశరథుడు పలవరిస్తుండగానే తెల్లవారింది. దశరథుని మాటలు, ఏడుపు వల్ల్ల కైకేయి కోపం రెట్టింపయింది. ఆమె మండి పడుతూ 'ఇంకా ఆలస్యం చేస్తున్నావేమి? వెంటనే రాముని ఇక్కడకు రప్పింపుము. వనగమనానికి ఆజ్ఞాపింపుము. నిష్కంటకమైన రాజ్యా న్ని నా కొడుకు భరతునికి అప్పగింపుము' అంటూ కక్కసించి మాట్లాడింది.
Comments