top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

భగవంతుడే నిత్య కర్మశీలి

  • Jun 3, 2018
  • 2 min read

Updated: Jun 5, 2018


సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఎక్కువగా కనబడే పదం. ఎవరూ ఏదో ఒక కర్మ చేయకుండా క్షణం ఊరికే ఉండరు. అందరూ వారి స్వాభావిక గుణాలను బట్ట్టి వివిధాలైన కర్మలు చేస్తూనే ఉం టారు అంటుంది భగవద్గీత. 'దుష్కర్మలకు దూరంగా ఉంటూ సత్కర్మ ఫలాపేక్ష లేకుండా చేసినపుడు నిన్నే కర్మలూ అంటవు, కర్మ బంధనంలో పడవు. ఫలాపేక్ష లేని కర్మాచరణమే ముక్తికి మార్గమని గ్రహించు' అని కూడా భగవద్గీత చెబుతోంది. కర్మ అనే పదానికి నిఘంటువులో చాలా అర్థాలు ఉన్నాయి. కర్మ అంటే పని, విధాయక కృత్యం (డ్యూటీ), మత విషయకమగు కార్యాచరణమని అర్థాలు ఉన్నాయి. కర్మఫలం అంటే దురదృష్టమని, క్రియా ఫలాన్ని పొందునది మొదలైన అర్థాలున్నాయి. ఇక కర్మ, వికర్మ, అకర్మ, కర్మ యోనులు, భోగ యోనులు, కర్మేంద్రియాలు, కర్మ ఫలదాత, కర్మ పరమావధి, ఇలా అనేక పదాలను శాస్త్త్రకారులు గ్రంథాల్లో ఉపయోగించడం మనం గమనిస్తాం. ఇవి గాక వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, కుల ధర్మాలు కూడా అనేక కర్మలను బోధిస్తాయి. మానవుని జన్మలకు కూడా కర్మే కార ణమని తెలునుకోవాలి. తాను చేసిిన కర్మల ఫలాలను అనుభవించేందుకు అతను జన్మ ఎత్త్తవలసి ఉంటుంటుందని చెబుతారు. వీటన్నిటికి అర్థం తెలుసుకుం టే 'కర్మ సిద్ధాంతం' మనకు బోధపడినట్లే. భగవంతుడు ఎక్కువ కర్మలు చేస్తాడు ఈ విశ్వంలో నిరం తరం అందరి కంటే ఎక్కువగా కర్మలు చేసేవాడు భగవంతుడు. అతడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఒక సెకను కూడా ఖాళీ లేకుండా భూమి, సూర్యుడు, చంద్రుడు, కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు (తోక చుక్కలు )మొదలైన పదార్ధాలను ఈ విశ్వంలో గిర గిరా తిప్పుతూనే ఉన్నాడు. మనం పగలు పని చేసి, రాత్రి విశ్రాంతి కోరతాం. వారంలో ఆరు రోజులు పనిచేసి ఒకరోజు విశ్రాంతిగా ఉండాలనుకుంటాం. కాని భగవంతుడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వాన్ని నడుపుతున్నాడో మనకు తెలియదు. ఆయన నిత్య జాగరూకుడై జీవులు చేసే శుభాశుభ కర్మలు గమనిస్తూ ఆయా జీవులకు సుఖ దు:ఖాలనిస్తూ, కర్మఫలదాత అయి ఉన్నాడు. తన అనంత బలం చేత ఈ విశ్వంలోని సమస్త పదార్థాలను సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు. లయం చేస్తున్నాడు. తన అనంత జ్ఞానం చేత సమస్త పదార్థాలను ఉన్నవి ఉన్నట్టు తెలుసుకుంటున్నాడు. జీవులు చేసే కర్మలను గుర్తించి వాటికి తగిన ఫలాలను ఇస్తున్నాడు. ఆయనను మించిన కర్మశీలి, కర్మ సాక్షి, కర్మాధ్యక్షుడు మరొకడు లేడు. అందుచేతనే ఉపనిషత్కారుడు ఇలా అన్నాడు. 'ఆ పరమేశ్వరునికి శరీర రూప కార్యంగాని, నేత్రాది ఇంద్రియ రూప సాధనాలుగాని లేవు. అతనికి సమానమైన వాడు గాని, అతనిని మించిన వాడు గాని లేడు. అతని శక్తి సాటిలనిది. వేదాది శాస్త్రాల్లో ఆయన శక్తి వర్ణించబడింది. ఆయనకు అనంత జ్ఞానం, అనంత బలం, అనంత కర్మ సామర్థ్యం స్వభావ సిద్ధంగా ఉన్నాయి. పరమేశ్వరుడు పూర్ణ జ్ఞాన స్వరూపుడు. ఆయన సర్వత్ర నిండి అన్ని పదార్థాలను తన వశంలో ఉంచుకున్నాడు. ఆయన పొందవలసిందిగాని, కోరవలసింది గాని ఈ సృష్టిలో ఏమీ లేదు. మానవులు అల్పజ్ఞులు, అల్ప శక్తియుక్తులు కలవారు. వారికి అనేక కోరిక లుంటాయి. వాటిని సఫలం చేయడానికని పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. భగవత్‌ ప్రసాదితమైన, వేదం నిర్దేశించిన కర్మలను మాత్రమే మానవుడు చేయ వలసి ఉంటుంది. సర్వే జనా: సుఖినో భవంతు

コメント


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page