ఆచరణే ఆరాధన
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చె ప్పిన బోధనలు పాటిం చటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే తెలుసు కున్నాం. ఆయా బోధనలు చేసిన మహాత్ములను మనం ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. కలిసి మాట్లాడి ఉండక పోవచ్చు. ఒక్క పైసా ఇచ్చి ఉండక పోవచ్చు. వారి బోధనలను ఆచరణలో పెట్టటమే వారి పట్ల మనం గౌరవాన్ని, భక్తి, శ్రద్ధలను కనబరచినట్లు అవుతుంది. ఆ విషయాన్నే తెలుపుతుంది మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఎదురుగా గురువు లేకున్నా, ఆయనను మనసులో నిలుపుకుని సాధన చేసి విలువిద్యలో అద్భుత నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఇటువంటి సంఘటనే బుద్ధ భగవానుని జీవితంలోను జరిగింది.
బుద్ధ భగవానుడు దేశాటనలో భాగంగా ఒక రాత్రి వేళ కుమ్మరి శాలకు చేరుకున్నాడు. ఆ శాలకు ఆయన కన్న ముందే ఒక యువ పరి వ్రాజకుడు వచ్చి ఉన్నాడు. వారికి పూర్వ పరిచయం లేదు. ఆ యువ పరివ్రాజకుని మాట, ప్రవర్తన బాగా నచ్చాయి బుద్ధ భగవానునికి. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఓ భిక్షూ! నీవెవరి పేరున ప్రవ్రుజిడవైనావు లేక నీ శాస్త ఎవరు? ఎవరి ధర్మాన్ని ఇష్టపడతావు? అని ఆ యువకుని ప్రశ్నించాడు. అతడు సమాధానమిస్తూ, 'మిత్రమా! శాక్య పుత్రుడైన శ్రవణ గౌతము డున్నాడు. అతడు భగవంతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అతనే నా శాస్త, నేనతని ధర్మాన్నే ఇష్టపడతాను అన్నాడు. దానితో బుద్ధుడు ఒకింత ఆశ్చర్యంతో 'ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇప్పుడెక్కడున్నాడు. నీవు ఆయనను ఎపుడైనా చూశావా? చూస్తే గుర్తించగలవా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ సన్యాసి చెబుతున్న సమ్యక్ సంబుద్ధుడు తానే. ఆ యువ సన్యాసిికి తానెప్పుడూ ఏదీ ప్రత్యక్షంగా బోధించలేదు. దానికా యువ సన్యాసి 'నేను భగవంతుని ఏ నాడూ చూడలేదు. అందువల్ల చూసినా గుర్తించలేను అన్నాడు. పరో క్షంగా తన బోధనలు విని భక్తి శ్రద్ధలతో వాటిని ఆచ రిస్తున్న ఆ యువ సన్యాసికి బుద్ధుడు తానెవరో తెలిపి ధర్మాన్ని వివ రిస్తూ ఇంకెన్నో విషయాలను తెలి యజేశాడు. ఆనందం హృద యంలో పొంగి పొరలగా, రెండు కళ్ళలో నీరు ఉబ కగా, ఆ యువ సన్యాసి బుద్ధ భగ వానుని పాద పద్మాలపై తల ఉంచాడు. రెండు చేతులూ జోడించి, 'భగవాన్! నేను మిమ్మల్ని మిత్రమా అన్నందుకు నన్ను క్షమించండి. నా పేరు పుష్కర స్వాతి. నాకు ప్రవ్రాజ్య ఉప సంపద భ్రిక్ఖు సంఘంలో సదస్యత్ర ఇవ్వండి' అని ప్రార్థించాడు.
భక్తి, శ్రద్ధ అంటే అవి. ఏ మహనీయుని విషయంలోనైనా మనకు ఆరాధనా భావముంటే వారి బోధను ఆచరించాలి గాని పాదపూజలతో, పూలహారాలతో, హారతి అర్చనలతో సరిపెట్టు కోరాదు. అవి ఉద్ధరించవు. సనాతన ధర్మం మనం ఆరు రుణాలతో పుడ తామని చెబుతుంది. అవి భూత రుణం, పితృరుణం, మాతృ రుణం, దేవ రుణం, ఋషి రుణ ం, మనుష్య రుణం. ఇవి తీర్చుకోవాలంటారు. వాటికి విధా నాలున్నాయి. వాటిలో ఋషి రుణాన్ని తీర్చుకోవడం ఎలా గంటే వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని వారు చేసిన రచ నలు చదివి ఆచరించడం ద్వారానేనని చెబుతారు. అంటే నిజమైన ఆరాధన ఆయా మహనీయుల బోధనలు ఆచరించడమేనని తెలుస్తుంది. లోకోపకారమే ఆ మహ నీయుల ఉద్దేశం. వారి బోధ నలు ఆచరించడం ద్వారా మన జీవితాలు, సమాజం బాగు పడతాయి. అవి బాగుపడితే రాష్ట్రం, దేశం ఇలా అన్నీ బాగుపడతాయి.
Comentarios