top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

ఉరుములు,మెరుపులు మెరిస్తే.. 'అర్జునా..ఫాల్గునా' అని ఎందుకంటారు..!

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 1 min read

సాధారణంగా మనం ఉరుములు..మెరుపులు మెరిసే సమయంలో 'అర్జునా..ఫాల్గునా' అంటారు..అలా అంటే అవి ఆగిపోతాయని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. మరి నిజంగా అలా ఉచ్చరిస్తే ఉరుములు..మెరుపులు ఆగిపోతాయా..అసలు ఇలా అనడానికి కారణం ఏమిటీ..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఉరుములు..మెరుపులు.. పిడుగులు పడే సమయంలో అర్జునిడికి ఉన్న పది పేర్లు పెద్దలు చదువుకోమంటారు. అసలు దీని వృత్తాంత ఏమిటీ అని తెలుసుకోవాంటే మనం మహాభారతంలోని కథ తెలుసుకోవాల్సిందే. కౌరవులతో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు విరాట నగరానికి అజ్ఞాతవాసం చేయడానికి వస్తారు. ఆ సమయంలో పాండవులు ఒక్కో వేషం వేషం వేయాల్సి వస్తుంది..ఇక అర్జునుడు బృహన్నలగా మారుతాడు..ఉత్తరకుమారికి నాట్యం నేర్పిస్తాడు.


అడా మగా కాని బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయం. ఉత్తర గోగ్రహణ సందర్భంగా కౌరవులతో యుద్దం చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఉత్తర కుమారుడి రథసారధిగా వెళ్తాడు. కౌరవ సైన్యం చూసి ఉత్తరకుమారుడు భయపడుతుంటాడు..ఆ సమయంలో బృహస్నల ( అర్జునుడు) శమీ వృక్షం దగ్గరకు వస్తాడు. కౌరవులను ఎదుర్కోనడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు చెప్పి, అతని భయం పోగొట్టి విశ్వాసం కలిగిస్తాడు.


ఇక భయాన్ని ప్రారద్రోలే అర్జునుడి పది పేర్లు అవి ఎలా వచ్చాయి అనే విషయానికి వస్తే.. అర్జునః, పాల్గునః, పార్థఃకిరీటీ, శ్వేతవాహనః, భీభత్సో, విజయో, కృష్ణః, సవ్యపాచీ, ధనంజయః, ఈ నామాలకు అర్ధాలు ఇవి: అర్జునుడు అంటే తెల్లని వాడు. ఫల్గుణుడు అంటే ఫల్గుణ నక్షత్రంలో, మాసంలో పుట్టినవాడు. పృథ (కుంతిదేవి ) కుమారుడు కనుక పార్థుడు. యుద్దంలో అతని కిరీటం ( కీర్తి ) బాగా ప్రకాశిస్తుంది కనుక కిరీటి. తెల్లని గుర్రాలు పూన్చిన రథం కలవాడు కనుక శ్వేత వాహనుడు.


అతను యుద్దం చేసే రీతిని బట్టి భీభత్సుడు. ఎప్పుడు విజయం అతడినే వరిస్తుంది కనుక విజయుడు. మిక్కిలి ఆకర్షణీయమైన వాడిని తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు. కుడిచేత్తోనే కాదు, ఎడమ చేత్తో కూడా ధనస్సు ను వేయగలడు. మిక్కిలి ఆకర్షణీయమైన వాడిని తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు. కుడి చేత్తోనే కాదు, ఎడమచేత్తో కూడా ధనస్సును వేయగలడు గనుక సవ్యసాచి. ధనం మీద మోజు లేదు కనుక ధనంజయుడు. ఈ పది పేర్లూ, వాటి అర్థాలు చెప్పుకుంటే ఏ భయమైనా తీరి పోతుంది.

Kommentarer


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page