జంతువుల్లోనూ అపరిమిత కృతజ్ఞత
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
సోఫ్యాను ఒక సూఫీ యోగి. ఆయన తన మకాం మక్కాకే మార్చివేశాడు. ఒక రోజు ఆయన బజారులో నడుస్తున్నాడు. ఎవరో ఒక పంజరంలో పక్షిని పెట్టి తీసుకుపోతున్నాడు. అది రెప్పలు టపటప కొట్టుకుంటూ దీనంగా అరుస్తోంది దాని భాషలో. ఆ పక్షిని, దాని అవస్థను చూసాడు సోఫ్యాన్. వెంటనే ఆ పక్షి యజమాని వద్దకు వెళ్లి ఆ పక్షిని ఎంతకు అమ్ముతావు అని అడిగి, అతను చెప్పిన ధరను చెెల్లించి కొని దానిని చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే దానికి పైకి ఎగుర వేసి స్వేచ్ఛ ప్రసాదించాడు. అది రాత్రి సోఫ్యాన్ వద్దకు వచ్చి ఆయన భగవంతుని ప్రార్థిస్తున్నంత సేపు ఆయన దగ్గ్గరే కూర్చునేది. మధ్యమధ్యలో ఆయన తన స్వంతమయినట్లు ఆయన భుజం పైకి ఎక్కేది. కొంత కాలానికి సోఫ్యాన్ శరీరం విడిచాడు. ఆ పక్షి ఆయన అంత్యక్రియల్ని చూసింది. ఆయనను సమాధి చేయడం పూర్తి కాగానే తనకు స్వేచ్ఛను ఇచ్చిన మహానుభావుడు లేని జీవితం ఇక వృథా అని భావించి ఎంతోఎత్తు నుంచి సోఫ్యాన్ సమాధిపై కావాలని పడింది. త క్షణం ప్రాణాలను విడిచింది. ఇది కృతజ్ఞతే కాదు సోఫ్యాన్ మీద దానికున్న ప్రేమ కూడా.
రమణులు తిరువణ్నామలైలో ఉండేవారు. సకల ప్రాణులు, మానవులు, కోతులు, ఆవులు మొదలైన వాటిని ఆయన సమ దృష్టితో చూసే వారు. ఒకసారి రమణులు తన బృందంతో గిరి ప్రదక్షిణకు బయలుదేరారు విరూపాక్ష గుహ నుంచి. అది మిట్ట మధ్యాహ్నం ఎండ ఎంతో తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు పచ్చియప్పన్ కోవెల ప్రాంతంలో నడుస్తు న్నారు. రమణుల బృందాన్ని ఒక కోతి మూక చూచింది. ఆ కోతి మూక పక్కనే ఉన్న ఫల వృక్షాన్ని కుదిపి పళ్లు నేల మీద రాలేట్లు చేసి రమణుల వంక చూసాయి. వాటి భావం అర్థమయింది. రమణుల బృందం అంతా ఆ పళ్లను ఏరుకుని, తిని తృప్తి పడ్డారు. ఆ కోతి మూక గతంలో రమణుల ఆతిథ్యాన్ని స్వీకరించింది. దానికి ప్రతిఫ లంగా పండ్లను రాల్చి తమ కృతజ్ఞతను తెలుపుకున్నాయి. కృతజ్ఞతను తెలిపే మనసును కూడా మహనీయులు ప్రసాదింతురు గాక!
భీతి చెందనీయకు మన మాటల వలన, చేతల వలన ఇతరులు భయపడకూడదు. ఇత రులు అంటే సాటి మానవులే కాదు. జంతుజాలం కూడా. మహనీయులె పుడు జంతుకోటిని భయభ్రాంతులకు గురి చేయరు. వాటికి వీలైనంత స్వస్థత కల్పిస్తారు. దుర్గాచరణ్ నాగ్ పెద్దవాడయ్యాక నాగ్ మహాశయుడ య్యాడు. అతడు సమస్త ప్రాణికోటిలోనూ పరమాత్మ నివసిస్తున్నాడనే వాడు. ఎలాంటి ప్రాణి కష్టపడటం చూసి సహించేవాడు కాదు. ప్రతి సంవత్సరం వరదలప్పుడు ఎన్నో చేపలు కొట్టుకుని వచ్చి ఆయన ఇంటి వద్ద్ద నున్న చెరువులో నివాసం ఏర్పరచుకునేవి. ఒక జాలరి ఆయన చెరువు వద్ద చేపలు పట్టి ఆనవాయితి ప్రకారం నాగ్ మహాశయునికి భాగం ఇవ్వబోయాడు. ఆ జాలరి వద్ద ఉన్న చేపలను చూపి జాలిపడ్డ్డాడు నాగ్ మహాశయుడు. వాటిని అన్నిటిని కొనడానికి ధర మాట్లాడి డబ్బు ఇచ్చి చేపలను తీసుకుని తిరిగి ఆ చేపలను చెరువులో వేశాడు నాగ్ మహాశయుడు.
ఆయనే ఒకసారి చెరువ వద్ద ముఖం కడుక్కుంటుంటే ఒక పాము ఎడమ కాలి బొటన వ్రేలి మీద కాటు వేసింది. తాను చిందులు వేస్తే పాము తన పాదాల కింద పడి ఎక్కడ నలిగిపోతుందోనని, ఆయన అక్కడి నుంచి కదల లేదు. తరువాత ఆయన భార్య శరత్ కామిని వచ్చి చూచి ఎంతో ఆందోళన వ్యక్తం చేసింది. దానికి ఆయన 'భయపడకు అది నీటి పాము. నా వేలిని కప్పగా భావించి పట్టుకుని వెంటనే తన పొర పాటును తెలుసుకుని నాకు అపాయం కలగకుండా వదలి పెట్టింది' అన్నారు నాగ్ మహాశ యుడు. నిజానికి ఆయన బాధను భరించే శక్తి అమోఘం. జంతుకోటిపై ప్రేమ మరింత అమోఘం.
Comments