top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

జంతువులకూ ముక్తిధామం

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 4 min read


ప్రకృతి పురుష సంయోగం శివలింగం. ప్రకృతీ పురుష సంయోగమే ఈ ప్రపంచంలోని సృష్టి అంతా. అనేక రూపాలు దాల్చి అనేకానేక రూపాలు తనలో ఉపహరించి ఏకాకిగా కనిపించే సాకార రూపుడు శివుడు. భక్తి వైరాగ్య శమ దమాది సంపత్తి మొదలైన సాధనాలతో ఆయనను ఉపాసించే వారందరికీ ఆయన లభిస్తాడు. ప్రపంచాన్ని పుట్టించటమే కాదు, ప్రకృతి పురుషుల్ని శాసించగలవాడు, సంసార పాశంలో చిక్కిన పశువును పాశం నుంచి విడిపించేవాడు శంకరుడు. అందుకే ఆయన పశుపతి. ఆయన స్పర్శ లేకుండా ప్రాణమే రాదు. ప్రాణమున్నపుడు జ్ఞాన ముంటుంది. ఆయా ప్రాణులకు తగిన విధంగా అవయవ ప్రమాణాలుంటాయి. అందుకే ప్రతి జంతువులో జీవుడు న్నాడు. అంటే ఆయా జంతువులన్నీ శివమయమై ఉన్నాయి. అందుకే తమ తమ ప్రవృత్తుల కనుగుణంగా పూజలు చేశాయి.


ఋతే శివం నాన్యతమో - గ తిరస్తి శరీరికామ్‌ శరీర ధారులగు జీవులందరికి శివుడు తప్ప ఇతరుడెవ్వడూ రక్షకుడు కాజాలడు. భోగమోక్షాలను ప్రసాదించువాడు శివుడే అని తెలుసుకున్నపుడే జీవన్ముక్తి లభిస్తుంది.

ఈ చరాచర ప్రపంచంలోని కదలిక గల జీవులను, జడము లను శివమయమని పూజించి శివుని ఉపాసించుటయే శివ జ్ఞానము. పశువు, పాశము, పతి అనే మూడు వస్తువులను తెలుసు కొనడమే జ్ఞానం. పుడుతూ సంసార పాశములతో బంధింపబడు ఆత్మ శివుడనబడును. ఇటువంటి పాశములను తొలగించుకుని జన్మ రాహిత్యం పొందటమే లింగారాధన. ఇది ధూర్జటి అది కృత యుగం ఒక చెలది పుర్వుకు (సాలీడు లేదా శ్రీ) దాని పూర్వ జన్మ విశేషం చేత శివభక్తి కలిగింది. దట్టమైన అరణ్యంలో కొండపై శివ లింగాన్ని చూసిందా సాలీడు. భక్తి పారవశ్యం ముప్పిరిగొనగా తనదైన ఆరాధనా పద్ధతిలో, తన నుంచి స్రవించే దారాలతో మహా శివునికి గుళ్లు గోపురాలు, ప్రాకారాలు, నర్తన మందిరాలు, కొలువు కూటాలు, పందిళ్లు, కల్యాణ మండపాలు, ఒకటేమిటి సమస్తాన్ని చిత్ర విచిత్ర మైన అల్లికలతో అత్యంత అద్భుతంగా నిర్మించటం మొదలు పెట్టింది. ఒక్క శివలింగానికేనా కాదు. అక్కడున్న గణేశునికీ, కుమారస్వామికి, నంది, విష్ణువు, మాతృకలు మొదలైన అందరు దేవతలకు కూడా తన దారాలతో ఇళ్లు నిర్మించింది. ఎంతో వింత వింతగా, అందంగా, ఎంత అందంగా అంటే పొద్దుటి పూట మంచు బిందువులు పడి అవన్నీ ముత్యాల ఇండ్ల లాగా కనిపించేలా నిర్మించింది. మధ్యాహ్నం సూర్య కిరణాలు ప్రసరించి రంగు రంగుల రత్న కాంతులు కలిగిన ఇండ్లలా కనిపిస్తాయి. నిరంతరం సాలీడు చేసేే తపస్సది. అనాది నాధుడు, చెప్ప నలవి కాని మహిమ కలవాడు, అవధిలేని మంగళ గుణాలతో విరాజిల్లేవాడు, మహాయోగి, నిత్యుడు, సత్యుడు, జ్ఞాన సంపన్న మైనవాడు అయిన ఆ హరుని అద్భుతమైన పూజా విధానంతో ఆరా ధిస్తూ ఉన్నదా చెలది పుర్వు. అప్పుడప్పుడు ఉధృ తంగా వీచే కొండగాలికి అక్కడక్కడా దారాలు తెగిపోయి ఉంటే ఎప్పటి కప్పుడు ఆ దారాలను అతికించటంతోటే దానికి రోజంతా గడచి పోయేది. అదే ధ్యాస, అదే ధ్యానం, అదే జీవితం. దాని అమోఘమైన తపస్సుకు మెచ్చాడు శివుడు. పరీక్షిం చదలిచాడు. అక్కడే ఉన్న దీప శిఖకు ఆదేశమిచ్చాడు. అది సాలీడు కట్ట్టిన ఇళ్ళన్నిటిని తగుల బెట్టేసింది. సాలీడు అలవి మాలిన దు:ఖంతో కృంగి కృశించి కోపంతో రగిలి పోయింది.

జీవితంలో ప్రతి దినం ఒక ముహూర్త కాలమైనా అథవా క్షణ కాలమైనా శివుని సేవింపకుండుటయే గొప్ప దోషం. శివశక్తి సంపన్నులు, శివాసక్త మానసులు, శివస్మ రణ తత్పరులు ఎన్నటికీ దు:ఖం పాలు కారు. నా ఈ వ్రతాన్ని, ఈ తపస్సుని భంగ పరచిందీ దీప కళిక. అమ్మో ఎంత కష్టపడి కట్టాను నా శివుడికి ఇల్లు. ఎంతలో కాల్చే సింది. దీనిని నేను మింగకపోతే నా బ్రతుకు వృథా. నా కోపం తీరాలంటే ఇదొక్కటే మార్గం. లంపటాలతో నిండి న ఈ జీవి తంపై మోహం చాలు అను కుంది. 'నుత్కట గతి దీపికానల శిఖా విసరం బుల ద్రావబోవ గన్‌ మింగబోయింది. శివుడు ప్రత్యక్ష మయ్యాడు. 'నీ భక్తి గొప్పది, నేను మెచ్చా ను. నన్నెందుకు కొలి చావో చె ప్పు' అన్నాడు. 'అయ్యా, వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు కూడా నీ గురించి సంపూర్ణంగా చెప్పలేకపోయాయి. నేనిప్పుడు సంపూర్ణం గా నిన్ను తెలుసుకున్నాను. ఇప్పుడు నేనెవరినో కాదు. నీవే నేను ఇక కోరేదే ముంది శివా' అన్నది సాలీడు.

సూర్య కిరణాల ప్రసా రంతో ప్రపంచం ఎలా కాంతివంత మవుతుందో కృపా పరిపూర్ణుడైన శంకరుడు భక్తుల అజ్ఞానాన్ని తొలగి స్తాడు. అజ్ఞానం తొలగితే జ్ఞానం కలుగుతుంది. సాలీడు తానే మిటో తాను తెలుసు కుంది. ఇపుడు తాను వేరు కాదనుకొని ముక్తి సాధిం చుకుంది.

ప్రకృతి పురుష సంయోగం శివలింగం. ప్రకృతీ పురుష సంయోగమే ఈ ప్రపంచంలోని సృష్టి అంతా. అనేక రూపాలు దాల్చి అనేకానేక రూపాలు తనలో ఉప హరించి ఏకాకిగా కనిపించే సాకార రూపుడు శివుడు. భక్తి వైరాగ్య శమ దమాది సంపత్తి మొదలైన సాధనాలతో ఆయనను ఉపాసించే వారందరికీ ఆయన లభి స్తాడు. ప్రపంచాన్ని పుట్టించటమే కాదు, ప్రకృతి పురుషుల్ని శాసించ గలవాడు, సంసార పాశంలో చిక్కిన పశువును పాశం నుంచి విడిపించేవాడు శంకరుడు. అందుకే ఆయన పశుపతి. ఆయన స్పర్శ లేకుండా ప్రాణమే రాదు. ప్రాణ మున్నపుడు జ్ఞానముంటుంది. ఆయా ప్రాణులకు తగిన విధంగా అవయవ ప్రమాణాలుంటాయి. అందుకే ప్రతి జంతు వులో జీవుడున్నాడు. అంటే ఆయా జంతువు లన్నీ శివమ యమై ఉన్నాయి. అందుకే తమ తమ ప్రవృత్తులకను గుణంగా పూజలు చేశాయి.

త్రేతాయుగంలో ఒక పాము (కాళము), దివ్యమైన మణి మాణిక్యాలను పాతాళ లోకం నుంచి తెచ్చి సువర్ణముఖి నది ఒడ్డున దట్ట్టమైన అరణ్యమందున్న శివ లింగాన్ని అలం కరించి, ఆ దివ్యమైన వెెలుగులో మెరిసి పోతున్న దివ్యాతిదివ్యుడైన శంకరుని ధ్యానిస్తూ, ప్రేమిస్తూ, పూజిస్తూ మైమరచిపోయింది.

ద్వాపర యుగం ప్రారంభ మైంది. గుణా తీతుడైన శంకరుని ఆ దట్ట్టమైన అరణ్యంలో సువర్ణ ముఖి నది ఒడ్డున చూసిిందో ఏనుగు (హప్తి). అపార మైన భక్తి భావం ముప్పిరిగొనగా తన నిర్మలమైన మన స్సుతో అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించ సాగింది. సువర్ణ ముఖీ నదిలో స్నాన మాచరించి అడవిలోని మారేడు, నేరేడు లాంటి పత్రాలు, సువాసనలీనే పుష్పాలు, మధుర ఫలాలతో ఆ శివలింగాన్ని అర్చించి, పూజించటం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో పూజిస్తున్న పాము వచ్చింది. శివలింగాన్ని చూసి దు:ఖ పడింది. ఎవడు ఈ ముళ్ల కంపలతో, ఆకులతో, పూలతో పూజించిందని కోపించి, వాటిని పక్కకు తోసిి మళ్ళీ మణిమాణిక్యాలతో పూజించి వెళ్లింది. మళ్ళీ ఏనుగు వచ్చింది. ఈ పూజలు చేసిం దెవడు రాళ్ళు కప్పి ఎకసెక్కపు పూజలు చేస్తున్నాడనుకుంది. ఏమయ్యా శివయ్యా! ఈ నల్ల్లరాళ్ళు కలువలా? పచ్చ రాళ్లు మారేడు కాయలా, ఎర్ర రాళ్లు ఎర్ర తామరలా. ఈ రాళ్ళకు సువాసనా, మెత్తదన మా, చల్ల్లదనమా? ఎందుకు స్వీకరించావు. అయినా స్వామీ నిన్నని ఏమి లాభం. నీ ఇల్లొక కొండ, నీ పెండ్లాము కొండ కూతురు. అందుకే నీకు రాళ్లం టే ఇష్టంఅని ఎత్తిపొ డుస్తూ నిన్నేమీ అనలేనుగాని, నా వ్రతాన్ని నాశ నం చేస్తున్న వాడి సంగ తేంటో రేపు తేల్చుకుంటాను అనుకుంది.

మరుసటి రోజు పాము వచ్చింది. కోపం తారా స్థాయికి చేరింది. అక్కడున్న పత్రాలలో దాగింది. ఏనుగును చూసింది. వీడేనా ఈ పూజలు చేసింది అనుకుంది. నేను చచ్చినా పర్లేదు. వీడిని చంపాలని నిర్ణయించుకుంది. ఒక్కసారిగా ఏనుగు ముక్కు గుండా తొండంలోకి దూరి కుంభ స్థలం వరకూ వెళ్లి గిరగిరా తిరగసా గింది. ఈ హఠాత్సంఘటన ఏనుగును నివ్వెరపరచింది. తొండం నిండుగా నీరుపీల్చి వదిలినా లాభం లేకపోయింది. శిరోవేదన భరించలేక చెట్లను తొండంతో ఢీకొంది. నేలమీద పడి పొర్లాడింది. ఎలాగూ చావు తప్పదిప్పుడు. ఈ పామును కూడ చంపి చస్తాను అని పాము తప్పించుకోకుండా తొండాన్ని మెలి తిప్పి తలను వంచి కొండను గట్టిగా ఢీకొంది. పాము చితికి పోయింది. ఏనుగు కుంభస్థలం బద్దలైంది. ప్రత్యక్షమయ్యాడు శివుడు, కొండల రాజు కూతురు పక్కనుండగా, చంద్రుని చూడామణిగా కలిగి, వృషభ వాహనంతో. మీకేం కావాలి అన్నాడు. అయ్యా! సంసార జలధిలో పడి ఈ దేహంపై ఆశలు చావక తేలుతూ, మునుగుతూ ఉన్నాం. దేవా! నీ సాయుజ్య సుఖ మింతే చాలు అన్నాయి. దేహం వలన నిర్వర్తిం పబడేది కర్మ. కర్మము వల్ల అంగము లేర్పడతాయి. ఇట్లు పున:పున:జన్మకర్మలు సంభవిస్తుంటాయి. స్థూలము, సూక్ష్మము, కారణమని శరీరం మూడు విధాలు. స్థూల శరీరంతో ప్రాపంచిక కర్మలు నెరవేరుస్తాం. సూక్ష్మ శరీరం జ్ఞానకర్మేంద్రియ భోగము లను ఇస్తుంది. కారణ శరీరం ఆత్మానుభవం కలగజేస్తుంది. జీవులు తాము చేసిన సుకృత, దుష్కృతాలననుసరించి సుఖ దు:ఖాలను అనుభవి స్తారు. అందువల్ల కర్మ రజ్జువుచే కట్ట్టబడిన జీవుడు స్థూల సూక్ష్మ శరీర కృతమగు కర్మవశాన మాటిమాటికి సంసార మందు చక్రం వలె తిరుగుతుంటాయి. ప్రకృత్యాదులు మహా చక్రమని, శివుడు ప్రకృత్యాతీతుడిని తెలునుకుని చక్ర భ్రమణం నుంచి తొలగుటకు చక్ర నిర్మాత అయిన శివుడిని ఆరాధించి ముక్తి పొందిన శ్రీకాళహస్తిల ముక్తిదాయకమైన ప్రదేశం ఈ పుణ్య క్షేత్రమని ధూర్జటి వివరిస్తాడు.

Comments


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page