జగత్తు మిద్య..
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది వేదాంత సూత్రం. బ్రహ్మమొక్కటే సత్య మైనది, శాశ్వతమైనది. ఈ జగత్తు అంతా మిథ్య అంటే మాయ. దీనిపై తర్కించుకున్న నారదుడు ఒకసారి ద్వాపర యుగంలో కృష్ణుణ్ని కలుసుకున్నపుడు తనకు మాయను చూపమని అడిగాడు. తర్వాత చూపుతా నన్నాడు కృష్ణుడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన నారదుణ్ని కృష్ణుడు తన వెంట రమ్మన్నాడు. అకస్మాత్తుగా చనువుగా 'నారదా! నాకు దాహం వేస్తోంది. కొంచెం మంచి నీళ్లు తీసుకురా!' అన్నాడు. కృష్ణుడంటే సాక్షాత్తు తాను నిత్యం జపించే నారాయణుని అవతారం. అందువల్ల అలాగే అని నీళ్ళు తేవడానికి దగ్గరలో ఉన్న ఇంటి వద్ద్దకు వెళ్ళి తలుపు తట్టాడు నారదుడు.
జగన్మోహనాంగి అయిన ఒక యువతి తలుపు తెరిచింది. ఆమెను చూడగానే నార దుడు మైమరచి పోయి శ్రీకృష్ణుడు నీరు తెమ్మన్నాడన్న విషయం కూడా మరిచిపోయి, ఆ యువతితో సల్లాపా లాడుతూ కూర్చున్నాడు. ఆ రోజం తా శ్రీకృష్ణుడి దగ్గ్గరకు వెళ్ళలేదు. ఆ యువతి గురించే ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళి మళ్లి ఉదయాన్నే వచ్చి ఆ యువతితో సరస సల్లాపాలాడుతూ కాలం గడిపాడు. అలా ఇష్టాగోష్ఠులు సాగి వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆ యువతి తం డ్రి అనుమతి పొంది ఆమెను పెళ్లి చేసుకు న్నారు. కొన్నాళ్లకు వారికి పిల్ల్లలు కలిగారు. పన్నెండేళ్ళు గడిచాయి. మామ మరణించేడు. ఆస్తి అంతా వారికి సంక్ర మించింది. భార్యా, బిడ్డ్డలూ, భూములూ, పశువులూ మొదలైన సకల సంపదలనూ అనుభవిస్తూ నారదుడు చాలా సుఖ జీవనం చేస్తున్నాననుకున్నాడు.
ఇలా ఉండగా దగ్గ్గరలో ఉన్న నది ఒకటి పొంగి మహాప్రవాహమై గ్రామాన్ని ముంచివేసింది. నారదుడు ప్రాణాల్ని దక్కించుకోవ డానికి పారిపోవలసి వచ్చింది. భార్యను ఒక చేతితో, ఒక బిడ్డ్డను మరో చేత్తో పట్టుకుని భుజాల మీద ఇద్ద్దరు పిల్ల్లల్ని ఎక్కిం చుకుని ఆ మహా ప్రవాహాన్ని దాటుతున్నాడు. కాని ఆ ప్రవాహ ఉద్ధృతికి పట్ట్టు తప్పి చేతుల్లో ఉన్న భార్యా, బిడ్డా జారి కొట్టుకుని పోయారు. వారిని కాపాడుకునే ప్రయత్నంలో భుజాలపై ఉన్న ఇద్దరు బిడ్డ్డలను యావ చ్ఛక్తితో పట్టుకుని ఉన్నా కూడా ప్రవాహంలో పడిపో యేరు. నారదుడు గట్టు మీద పడి ఘోరశోకా వేశపరుడై ఏడుస్తూ మొత్తుకుంటున్నాడు. ఇంతలో వెనుక నుంచి, 'నారదా ఏవీ మంచి నీళ్లు? తెస్తానని వెళ్లేవు. నీ రాక కోసం నిరీక్షిస్తున్నా! అరగంట దాటింది' అన్న మాటలు వినబడ్డాయి. అరగం టేనా కృష్ణా! అని నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు. అతని మనసులో పన్నెండేళ్ళు గడిచేయి. కాని ఆ చరిత్ర అంతా జరిగింది అరగంటలోనే. 'నారదా! ఇదే మాయ అంటే. చూపిం చమన్నావు కదా! అనుభవం అయిందా?' అని అడిగేడు శ్రీకృష్ణుడు. (మాయ కల వంటిది. అది ఉండేది కొన్ని నిముషాలు. కాని ఎంతో సమయం గడిచినట్లుంటుంది). మానవుడు నిత్యం భగవం తుని మాయా విలా సానికి అబ్బురం చెందు తూనే వ్యామోహ పీడితుడు అవుతున్నాడు. ఒక్కోసారి మాయ నుంచి విడి వడి వైరాగ్యాన్ని పొందుతున్నాడు. కాని అది పురాణ వైరాగ్యమో, శ్మశాన వైరాగ్యమో అయి తిరిగి బురదగుంటలో వరాహం లాగా సంసారమనే కూపంలో పడి కొట్ట్టుకుంటు న్నాడు. అందుకే నిజమైన జ్ఞానాన్ని ప్రోది చేసుకోవాలి. గురువులు చెప్పే ఉపన్యాసాలలోని అంతర్లీన మైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తన వారిపైన కాని, తనవనుకునే వస్తు సంచయాలపైన గాని వ్యామోహం పెంచుకోకూడదు.
సంతానం వల్ల గాని, సంపదల వల్ల్ల గాని అమృత త్వాన్ని పొందలేము. ఈ లోకంలో కనిపించే ప్రతిదానికీ నాశనమయ్యే తత్త్వం ఉంటుంది. మానవులకు సంబంధించిన వస్తు నిక్షేపాలు ఎంత గొప్పవైనా అవి అన్నీ ఒక నాటికి నశించేవే. ఎప్పటికీ నిలిచి ఉండే వస్తువంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రతి వస్తువు గురించి మానవునిలో అంతర్లీనంగా ఒక భయం ఆవరించి ఉంటుంది . ఆ వస్తువు చేయి జారినపుడు అంతు లేని వ్యధకు లోనవుతుంటారు. అటు వంటి వ్యధలేనిది, ఎప్పటికి నశించనిది భగవంతుని తత్త్వ మొక్కటే. అందుకే భగవంతుని గురించిన జ్ఞానం తెలుసుకుని తీరవలసిందే.
Commentaires