దేవతామూర్తులుగా చూడగలగాలి..
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ని కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా బాదర బందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం. కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపిం చిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం, మన బాధలు తీరక పోతుంటే బట్టలు మార్చినంత సులభంగా దేవుళ్లని మారుస్తాం. 'ఈ దేవుడు శక్తివంతుడు, ఈయనైతే మన కోరికలు తీరిపోతాయి' అంటూ సర్టిఫిికెట్ ఇస్తుంటాం. పాత దేవుళ్లను వదిలేస్తాం, కొత్త దేవుళ్ల చిట్ట్టా వెతుక్కుని, ఆ కొత్త దేవుళ్ల భక్తులమైపోతాం. ఇది ఇప్పుడు సమా జంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరి ణామ క్రమం. ఈ పరిణామాలకు ఎవరినీ ఏమీ అనలేం. ఎవరి పరిస్థితి వారిది. ఎవరి విశ్వాసం వారిది. వారి వారి దృక్పథాలపై ప్రతిదీ ఆధా రపడి ఉంటుంది. దీనికి అద్ద్దం పట్టేదే కాకుండా, మరో సత్యాన్ని కూడా తెలిపే కథ ఒకటుంది. ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని గ్రహించాలి.
పూర్వం ఒకాయనకి చాలా చిక్కులొచ్చేయి. ఎక్కడి కెళ్లినా చుక్కెదురవుతోంది . ఆ పరిస్థితి నుంచి బయటపడా లంటే అపార మైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పేరు. ఏ దెెవుని పూజించా లనే మీమాంస వచ్చింది. శివుడు భోళా శంకరుడు, ఉబ్బులింగడు కదా భక్తులు పిలవగానే పలుకు తాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలోఎవరో చెప్పేరు కృష్ణుడు అద్భుత లీలలు, మహిమలు చేసినవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతా డని వారు చెప్పారు. అంతే ఆయన శివ లింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలు పెట్టాడు. కష్టాలు తీర లేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుణ్ని పూజించాలని ఆయన ఆరాధన మొదలెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ని పూజించాడు. కొన్నాళ్ళలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు. ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పేరు ఆంజనేయుడయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయ నను పూజించమని. ఈయనకీ నిజమేననిపించింది. వెంటనెె ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించటం మొదలెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్లు అందరూ ఇంతే. మగ దేవుళ్లు సులభంగా కరగరు, అమ్మ వారి లాంటి వారయితే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుం దని అంబని కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు.
అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేయి, కోరికలు నెరవేరాయి. సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలిగేయి. అంబ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అంబ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం అక్కడ ఒక కప్ బోర్డ్‌లో తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ఈ ధూపం ఆఘ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డ్డలు కట్ట్టాడు. అప్పుడు మళ్లీ అంబని ధ్యానిస్తూ కళ్లు మూసుకున్నాడు. కొంత సేపైన తర్వాత కళ్లు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకుని 'నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను.
మీరిప్పుడు వచ్చారా? నేనిపుడు మిమ్మల్ని పిలవలేదు. రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు, నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు 'నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం ఆఘ్రాణించకూడదని ముక్కునోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం చూసి దర్శనమిచ్చాం' అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్న ట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతణ్ని ఆశీర్వదించి అంతర్థానమయ్యారు.
ఇక్కడ మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి. ఆరాధిం చాలి. అప్పుడే వారు కనిపిస్తారు. రామకృష్ణ పరమహం స చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్ళాల్సి వచ్చింది. అది పుచ్చుకు బయలుదేరాడు. నైవెెద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజూ నైవేద్యం తింటూటుందనుకున్నాడు. 'రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి. తింటే కాని వెళ్లన'న్నాడు. తాను తింటా నన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అదీ విశ్వాసమంటే. అందరు దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలు. కష్టాలు కర్మఫాలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉప శమనం లభిస్తుంది.
Comentários