top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

ధర్మం అంటే ఏమిటి.?

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 2 min read


ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు.


పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం. వీటికి సనాతన ధర్మంలో ఉన్నత స్థానమిచ్చారు. ఇవి వేర్వేరుగా ఉన్నా ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిదైన ధర్మంతోనే మిగతా మూడింటిని లగింపు చేసుకోవాలని పెద్దలు అంటారు. ధర్మాలు పాటించటమే కాక అర్థ సంపాదన ధర్మంగా ఉండాలని, కామం ధర్మ బద్ధమైనదే అయి ఉండాలని, ధర్మం గానే మోక్ష సాధ నకు కృషి చేయాలన్నది దీనిలో అంతర్గతంగా ఉన్న మరో అర్థమని వారు చెబు తుంటారు. ధర్మా చరణ అంటేనే అన్ని పనులు ధర్మబద్ధంగా చేయడమని మరి కొందరు చెబుతుంటారు. ఇక పురుషార్థాలలో ధర్మం గురించి మరింత విపులంగా తెలుసుకుందాం.

ధర్మం. ధర్మం అనే పదానికి చాలా విస్తృ తమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచా రం, వేదోక్త విధి, ఉపనిషత్తు, యజ్ఞం, విల్లు, సత్కర్మ, నీతి మొదలైన అర్థాలు నిఘంటువులో ఉన్నాయి. మరో రకంగా చూస్తే ధరించేది కాబట్టి ధర్మం అవుతుంది. ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతుందో అదే ధర్మమని పెద్దలు నిశ్చయించారు. వేదం మానవుణ్ని ఏది చేయమని ఆజ్ఞాపిస్తుందో అది ధర్మమని జైమిని మహర్షి మంత్రపూర్వకంగా తెలి పారు. వేదం సమస్త ధర్మాలకు మూలం, ప్రమాణమన్నది మనుస్మృతి. అహింసా పరమో ధర్మ: (ఏ ప్రాణిని హింసించక పోవడమే శ్రేష్ఠమైన ధర్మం. ధర్మ శబ్దం పది లక్షణాలతో కూడుకున్నదని మనుస్మృతికారుడు మరొక చోట విశేష వివ రణ ఇచ్చాడు.

దశ లక్షణాలు. ధృతి.. ఎల్ల్లప్పుడూ ధైర్యంగా ఉండడం. ధర్మ కార్యాలను ఆచరించేటపుడు కలిగే కష్ట నిష్ఠురాలను సహిస్తూ వెనుకంజ వేయక ఆయా కార్యాలను పూర్తి చేయడం ధృతి అనబడుతుంది. క్షమ.. ఓర్పు కలిగి ఉండడం. సుఖ దు:ఖాల్లో, లాభనష్టాల్లో మానావ మానాల్లో సహన శీలుడై సమ భావంతో ఉండటం క్షమ అనబడు తుంది. దమము.. ఇంద్రియ నిగ్రహంతో ఉండటం అస్తేయం.. దొంగతనం చేయకుండడం. ఇతరుల వస్తువులను వారి అనుమతిలేకుండా తీసుకోకూడదనే భావన. శౌచము.. పవిత్ర భావాలు, భగవత్ప్రసాద బుద్ధి. దైవేచ్ఛ అనే ప్రపత్తి. శమము.. మనో నిగ్రహం కలిగి ఉండడం. ధీ.. ధీ అంటే బుద్ధి. బుద్ధిని మందగింపజేసే పనులు అనగా మాదక ద్రవ్య సేవనం, దుష్ట సాంగత్యం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండటం. మంచి బుద్ధి కలిగి ఉండడం. విద్య.. పరమేశ్వర పర్యంతం పదార్థాల జ్ఞానం కలిగి వాని నుంచి ఉపకారం పొందడం విద్య. ఆత్మనందు ఉన్నట్టు మనస్సులో తలచడం, మనస్సులో తలచినది వాణి (మాట) ద్వారా పలకడం, వాణి మేరకే కర్మలయందు ప్రవర్తించడం విద్య. సత్యం.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం, వినడం, ఆచరించడం, సత్యమనబడుతుంది. సత్యం చెప్పాలిగాని ఇంపుగా చెప్పాలి. సత్యాన్ని అప్రియం అంటే కష్టం కలిగేట్లు చెప్పరాదు. ఇంపుగా ఉంటుంది గదా అని అబద్ధం చెప్పకూడదు. ఇది అనాదిగా వస్తున్న ధర్మం. ఉదాహరణకు అంగవైకల్యం కల వారిని అంగవైకల్యంతో సంబోధించరాదు. అక్రోధం.. పరులకు కష్టాన్ని, హానిని కలిగించే కోపాన్ని విడిచి , శాంతం సౌమ్యం మొదలైన గుణాలను గ్రహించడం అక్రోధం అవుతుంది. ఈ పది లక్షణాలతో కూడిన పక్షపాతరహిత న్యాయాచరణమనే ధర్మాన్ని బ్రహ్మచారులు, గృహస్థులు, వాన ప్రస్థులు, సన్యాసులు అందరూ సేవించాలి. ఇది ధర్మం అనే పదానికి మనువు చెప్పిన నిర్వచనం. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థకామాలు లభ్యమవుతాయని వ్యాస మహర్షి వచనం. అర్థాన్ని, కామాన్ని (కోరికలను) ధర్మంతో ముడిపెట్టి ఆచరించేవారికి మోక్ష మార్గం అప్రయత్నంగా లభిస్తుంది.


ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత:

ధర్మాన్ని నశింపజేసే వ్యక్తిని అది నశింపజేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని అది రక్షిస్తుంది. అందువల్ల ధర్మాన్ని నాశనం చేయకూడదు. మన చేత ధర్మం చంపబడక మనలనది రక్షించుగాక. ధర్మాన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా విడవరాదని మనువు అంటాడు.

మహాభారతంలో ధర్మరాజు ధర్మానికి ప్రతీక. భారతం ధర్మంతోనే ముగుస్తుంది. ధర్మం తెలిసిన వారు ధర్మానికి ఇబ్బంది కలిగించే ధర్మాన్ని ధర్మంగా భావించరు. ధర్మమనేది సర్వులకు హితమైనదై ఉండాలి. సమిష్టి ధర్మానికి, వ్యష్టిధర్మానికి వైరుధ్యం కలిగినప్పుడు వ్యష్టి ధర్మాన్ని త్యాగం చేయాలి. భీష్ముడు వ్యష్టి ధర్మాచర ణం కోసం సమిష్టి ధర్మానికి హాని చేయడం వలన మరణించాల్సి వచ్చిందని కొందరి అభిప్రాయం.


ధర్మాత్ములు. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదింటిని పూజించేవారు ధర్మాత్ములు అని శాస్త్రం చెబుతోంది. ధర్మం నిత్యం. సుఖ దు:ఖాలు అనిత్యం. అందువల్ల సుఖేచ్ఛ చేత గాని, భయం చేత గాని, లోభం చేత కాని ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ధర్మాన్ని విడువకూడదు. జీవుడు నిత్యుడు. అతడు నివసించే ఈ శరీ రం అనిత్యం. అందువల్ల్ల అనిత్యాలైన వాటి కోసం వ్యర్థ ప్రయత్నాలు చేయక నిత్యుడైన జీవుడు నిత్యమైన ధర్మం కోసం యత్నించడం శ్రేయస్కరమవుతుంది. శ్రీరామాయణంలో రాముని ప్రతి కదలిక ధర్మాన్ని సూచిస్త్తుంది. అందుకే మానవాళికి శ్రీరామాయణం ఆదర్శ ప్రాయం. సర్వే జనా: సుఖినో భవంతు

Kommentare


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page