ధర్మం సార్వజనీనం
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
ధర్మం సార్వజనీనం.
ధర్మ లక్షణాలలో ఎక్కడా కూడా ఈశ్వరార్చన గురించి లేదు. అంటే ధర్మం సర్వు లకూ, సర్వకాలాలలోనూ ఆచరణీయమైనదేనని చెప్పటం. దైవభక్తి లేకపోయినా ధర్మాచరణ తప్పనిసరి. మనం దారిలో నడుస్తు న్నపుడు రక్షకభటులు మన రాకపోకలను నియంత్రిస్తారు. వారి నియంత్రణలకనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆ కోడ్ నియమాలు ఏదో ఒక మతానికి చెందినవి కావు. జనసామాన్యం కోసం ఏర్పరచిన నియమాలవి. వాటిని పాటించడం వల్ల అందరికీ మంచి జరుగు తుంది. అలాగే ధర్మం కూడా. మానవ సమాజం ఏర్పడిన నాటి నుంచి మానవాళి శ్రేయస్సుకై ఏర్పడినది ధర్మం.
ధర్మం అనే పదం అందరికీ సుపరిచితమే. దాని పూర్తి ఆచరణే అంతగా కనబడదు. ఇక ధర్మో రక్షతి రక్షిత: అనే వాక్యం అంద రికీ తెలిసిందే. అయితే అది ఒక శ్లోకంలోని కొంత భాగమే. పూర్తి శ్లోకం ఇది: ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షిత: తస్మాద్ధర్మో నహంతవ్యో మానో ధర్మా మతోనధీత్ (మనం ధర్మాన్ని నాశనం చేస్తే అది మనల్ని నాశనం చేస్తుంది. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నశింపజేయకూడదు. ధర్మం నాశనం లేనిదై మనల్ని నశింపజేయనిదై ఉండుగాక!) ధర్మం అనే పదానికి చాలా విస్తృత అర్థం ఉంది. స్వధర్మో నిధనం శ్రేయ:. అని జగద్గురువు భగవద్గీతలో పేర్కొన్నాడు. మన మిత్రుడు మనకు కష్ట కాలంలో సహాయపడక స్వార్థపరుడైతే మిత్ర ధర్మాన్ని పాటించటం లేదంటాం. ఈ మధ్య రాజకీయాలలో రాజ ధర్మం అనే పదం వాడబడుతోంది. ముష్టివాడు దానం చేయ మని అడగడానికి 'ధర్మం చేయండి బాబూ' అంటాడు. ధర్మ అనే పదానికి సమానార్థక పదం ఏ భాషలోనూ లేదు. అందు వల్లే భారతీయులందరూ తమ తమ భాషలలో ధర్మం అనే మాటనే వాడుతుంటారు. అయితే ఆంగ్లేయులు వచ్చాక భాషా పరమైన సమస్యలొచ్చాయి. ధర్మం జీవన విధానానికి సంబం ధించిన విషయం. ధర్మం అంటే విశ్వాసం కాదు. విశ్వాసాన్ని ధర్మంగా భావించుకుని 'రెలిజియన్' అని వాళ్లు అనువదించు కున్నారు. వాళ్ళనే ఆధారంగా చేసుకుని మతపర మైన అన్ని విషయాలను 'ధార్మిక'మైనవిగా పిలవడం ప్రారంభించాం. వాస్తవానికి ధర్మం అనే పదాన్ని సరిగా నిర్వచించలేకపోయినా ధర్మం లక్షణాలను మనం తెలునుకోవచ్చు.
ధృతి క్షమా దమో స్తేయం శౌచమింద్రియ నిగ్రహ: ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణమ్ (ధైర్యం, క్షమా గుణం, మనో నిగ్రహం, పరధనాపహరణ కోరిక లేకపోవడం, శుచి, కర్మేంద్రియాలపై, జ్ఞానేంద్రియాలపై నిగ్రహం, శాస్త్త్ర జ్ఞానం, ఆత్మ జ్ఞానం, సత్యం, అక్రోధం అనే ఈ పదీ ధర్మ ల క్షణాలు. మరొక చోట అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహం అనే ఐదు లక్షణాల గురించీ చెప్పారు. మొత్తం మీద ధర్మ లక్షణాలలో ఎక్కడా కూడా ఈశ్వరార్చన గురించి లేదు. అంటే ధర్మం సర్వులకూ, సర్వ కాలాలలోనూ ఆచరణీయమై నదేనని చెప్పటం. దైవభక్తి లేకపోయినా ధర్మాచరణ తప్పని సరి. మనం దారిలో నడుస్తున్నపుడు రక్షక భటులు మన రాకపోకలను నియంత్రిస్తారు. వారి నియంత్రణలకను గుణంగా మనం నడుచుకోవాలి. ఆ కోడ్ నియమాలు ఏదో ఒక మతానికి చెందినవి కావు. జనసామాన్యం కోసం ఏర్ప రచిన నియమాలవి. వాటిని పాటించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. అలాగే ధర్మం కూడా. మానవ సమాజం ఏర్ప డిన నాటి నుంచి మానవాళి శ్రేయస్సుకై ఏర్పడినది ధర్మం. అందుకనే మనం దానిని సనాతన ధర్మం అంటున్నాం. ఎవరు ఏ దైవాన్ని కొలుస్తున్నా పితృవాక్యాన్ని పాటించాలి. తల్లిని గౌరవించాలి. ఇంటికొచ్చిన అతిథిని ఆదరించాలి. పేదవారికి దానం చేయాలి. శ్రద్దయా దేయమ్ అశ్రద్ధయా అదేయమ్ శ్రియా దేయమ్ హ్రియా దేయమ్ భయా దేయమ్ సంవిదా దేయమ్ (శ్రద్ధతో ఇవ్వు, అశ్రద్థ తో ఇవ్వవద్దు, సంపదననుసరించి సిగ్గుతో, భయంతో దానం చేయి. వివాహాది సత్కార్యాలకు దానం చేయి) ఈ విధములైన విషయాలలో మత విశ్వాసానికి చోటు లేదు. ధర్మానికి మాత్రమే చోటున్నది. అందువల్ల ధర్మం మతాల కతీతమైనది. మత విశ్వాసం లేకపోయినా ఆచరించదగింది. పరాయి స్త్రీని తల్లిలా చూడమని ధర్మం చెబు తుంది. అలా చూడనపుడు సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. సామాజికుల జీవనం అధోగతి పాలవుతుంది. దీనినే మన వారు ధర్మో రక్షతి రక్షిత: అన్నారు. నీవు నీ కర్తవ్యాన్ని పాటిం చాలి. అపుడు సమాజం నీకు రక్షణ కల్పిస్తుందని దీని అర్థం. ఈ సూక్ష్మ విషయాలను దృష్టిలో ఉంచుకుని అందరూ తమ తమ కర్తవ్యాలను నియమం తప్పకుండా పాటించ టానికి కర్తవ్య నిష్ఠను, ధర్మాచరణను మత విశ్వాసంలో భాగం చేశారు. అప్పుడే నాగరికులు, పామ రులు, జానపదులు ఒకే రీతిలో ధర్మాన్ని ఆచరిస్తారు, గౌరవిస్త్తారు. మన ఆధునిక జీవితాలలో నాగరికత పేరుతో ధర్మాచరణనే మరచిపోతున్నాం. నాగరికత పెరిగిన కొద్దీ సాంస్కృతిక విలువల పట్ల శ్రద్ధ పెరగాలి. వాటిని నిజ జీవితంలో ఆచరించాలి. కాని నేడు అలా జరగడం లేదు. ధర్మం అంటే మత విశ్వాసమనీ, ధర్మాచరణకు మత మౌఢ్యమనీ పెడార్థాలు తీసిి దారి తప్పుతున్నారు చాలా మంది. ధర్మమంటే అవగాహన కలిగించుకుని ధర్మాచరణే దైవారాధన అని భావించి నడుచుకుంటే కలియుగంలోనూ మనం కృతయుగాన్ని చూడగలుగుతాం.
Comments