ధర్మనిరతి.
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
రాముని మాటలు విని కౌసల్య, 'రామా! తల్లి కూడా తండ్రి వంటిదే! తల్లి మాట పాలింపవా? నీవు వనవాసం చేయడానికి నేను సమ్మతించను, నన్ను శోక సముద్రంలో ముంచి అడవులకు వెళ్లడం ధర్మమా? నీవే ఆలో చింపవయ్యా! నీవు లేకపోతే నాకు సుఖం లేదు. జీవితం లేదు. కన్నతల్లిని అనే కరుణ కూడా లేకుండా విడిచి వెళతావా?' అని ఏడ్చింది. 'నేను కూడా నీ వెంట వస్తాను' అని పట్ట్టు పట్టింది. రాముడు తల్లిని చూసి, 'నేను అడవులకు వెళ్ళక తప్పదు. ఇది నా నిశ్చి తాభిప్రాయం. నా ప్రాణాల మీద ప్రమాణం చేసిి చెబుతున్నాను. నీవు, నేను, లక్ష్మణుడు, సుమిత్రా మాత ఎవ్వరైనా మహారాజు ఆజ్ఞను శిరసావ హించవలసిందే! ఇదే సనాతన ధర్మం. వనవాసాగమనానికి సమ్మతించి, నన్ను దీవించి పంపుము. పద్నాలుగేండ్లు వన వాసం చేసిి తిరిగి వస్తాను. ఇది నిజం' అన్నాడు. రాముడు లక్ష్మణుని చూసి, 'లక్ష్మణా నీవు కూడా తల్లి వలె అనాలోచి తంగా మాట్లాడుతున్నావేమి? మహారాజు మనకు ప్రభువు, తండ్రి, గురువు, దైవం కూడా! అలాంటి తండ్రి క్రోధ వశుడై ఆదేశించినా, కామాసక్తుడై ఆజ్ఞాపించినా అనుసరించడం మనకు అవశ్య కర్తవ్యం, దానిని అనుసరించకపోవడం అధర్మమే కాదు దోషం కూడా! నేను తండ్రి ఇచ్చిన వరాలను నెరవేర్చవలసి ఉన్నది. తండ్రి మాటను నేను జవదాటలేను. అందరికీ ప్రభువు అయిన తండ్రి మాట మనకు వేదంతో సమానం! భర్త బతికి ఉండగా నా తల్లి నాతో రావడం తగునా! ఇది సహధర్మ చారిణికి ధర్మం కాదు. అమ్మ నాతో అడవులకు రావడం ధర్మ సమ్మతం కాదు. ఈ రాముడు క్షణిక సుఖాలకై శాశ్వతమైన ధర్మాన్ని విడువలేడు' అని తన దృఢ నిశ్చయాన్ని వెల్లడించాడు. సోదర భక్తి - దృఢ సంకల్పం రాముని పట్టాభిషేకం ఆగి పోవడం, ఆయన వనవాసం ల క్ష్మణుని మనస్సును తీవ్రంగా కలచివేశాయి. ఒక వైపు మనో వ్యథ, మరొక వైపు కైకేయీ, దశరథులపై ఆగ్రహం అతిశయించాయి. లక్ష్మణుడు కోపంతో బుసలు కొట్టాడు. రాముడు లక్ష్మణుని శాంతింపజేయడానికి ఇలా ప్రయత్నించాడు. 'లక్ష్మణా! తండ్రిపై కోపించడం తగదు. పట్ట్టాభిషేకం ఆగిపోయింది. వన వాసం చేయాల్సి ఉంది అని నీవు దు:ఖింపవద్దు. నా పట్ట్టాభిషేక మహో త్సవ ఏర్పాట్లను ఎంత ఉత్సాహంతో పర్యవేక్షిం చావో, అంతే ఉత్సాహంతో వన గమనానికి ఏర్పాట్లు చేయుము. నేను అడవులకు వెళతానో? లేదో? భర తుని పట్టాభిషేకం జరుగుతుందో లేదో! అని తల్లి కైకేయి మధన పడుతూ ఉంటుంది. మన తండ్రి సత్య సంధతను కాపాడడమే నా ఆకాంక్ష. ఆలస్యం చేయకూడదు. వెంటనే నార చీరలు ధరించి బయలుదేరాలి. ఇవన్నీ విధి నిర్ణయాలు. మానవులు కేవలం నిమిత్త మాత్రులే! తల్లులు అందరూ నాకు సమానులే. నిన్నటి వరకూ కైకేయి నన్ను భరతుని కంటె మిన్నగా అభిమానించింది. ఒక్క రోజులో ఆమె నన్ను అడవుల పాలు చేస్తున్నదంటే, దానికి దైవ ప్రేరణే కారణం. కైకేయి నోటి నుంచి పరుష వాక్యాలు రావడం ఆమె దోషం కాదు. ఇది విధి ఆడిస్తున్న బొమ్మలాట! ఎంతటి వారైనా ప్రారబ్ధ కర్మఫలం అనుభవించక తప్పదు. పూర్వ జన్మ కర్మ ఫలితంగానే నా పట్టాభిషేక ప్రయత్నం విఫలమయింది. వనవాసం నిశ్చ యింపబడింది. దీనిని ముందుగా ఎవ్వరూ ఊహింపలేరు. తప్పింప లేరు కూడా! సుఖ దు:ఖాలకు, లాభ నష్టాలకు, జనన మరణాలకు, భయ క్రోధాలకు, ప్రారబ్ధ కర్మే కారణం కాని వ్యక్తులు కాదు. ఇలా జరగాలన్నది దైవ నిర్ణయం. ఎవ్వరినీ ద్వేషిం పవద్దు. ప్రాప్తించిన దానిని అనుభవించాల్సిందే. శోక రోషాలను విడిచి అన్నిటినీ సమ బుద్ధితో స్వీకరించడం శ్రేయస్కరం. ద్వంద్వములను విడిచి పొంగుడు కృంగుడులు లేక నిత్యం సంతుష్టితో జీవించాలి. రాజ్యాధికారమైనా, వనవాసమైనా నాకు సమానమే! ఈ అనర్థానికి కారణం నా ప్రారబ్ధ కర్మమే కాని మన తల్లి కైకేయి కాదు' అన్నాడు.
Comentarios