మానవత్వాన్ని మించిన తపస్సు లేదు
- B Ashok Kumar
- Jun 5, 2018
- 3 min read
చెట్లు ఫలాలనిస్తున్నాయి. ఆ చెట్లే ప్రాణికోటి బతకడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. మేఘుడు ఉపకార బుద్ధితో ఆకాశం నుంచి నీటిని కురిపిస్తున్నాడు. ఇవన్నీ నిస్వార్థంతో కూడినవే. మరి బుద్ధి జ్ఞానాలున్న మానవుడు ప్రకృతి నుంచి పాఠాలెందుకు నేర్చుకోడు. అందుకు కారణం స్వార్థమే. నిజం చెప్పాలంటే అన్ని కోరికలూ సంకల్పం వల్ల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్తకొత్త సంకల్పాలు ఉద్భవించకుండా చూసుకుంటే కోరికలు క్రమంగా క్షీణిస్తాయి.
పురాణేతిహాసాల్లో తపస్సు అనే మాట ఎక్కువగా కన బడుతుంటుంది. అందరి కోసం, తన కోసం తపస్సు చేసే వాడే తపస్వి. తపశ్శీలుడు అంటే తపించే స్వభావం కలవాడు. తపన అనే శబ్దం పట్టుదలని, సత్కర్మని ఆచరించే దీక్షను తెలియ జేస్తుంది. అథర్వ వేదంలో ఈ విషయాన్ని తెలియజేసే మంత్రం ఉంది. ముక్కు మూసుకుని జపం చేయడమే తపస్సు అంటే అది పొరపాటే. దేశ, సమాజ హితం కోసం నిర్విరా మంగా, నిస్వార్థంగా చేసిన సేవను మించి న తపస్సు లేదు. మరి నేడు ప్రపంచం ఎటు వెడుతోంది. మనల్ని లోకానికి పరి చయం చేసిన ఆ విధాతను కూడా విస్మరించి అలుపెరుగని కార్యకలాపాలతో సంపదను సృష్టిస్తున్నాం. అయితే అవి దూరమైన క్షణకాలంలో ఎవరినైతే మనం ఆత్మీయులమని భావిస్తున్నామో వారందరూ దూరమవుతారు. ఇక్కడ కప్పలు, సరస్సు ఉదాహరణగా తీసుకుందాం. సరస్సులో నీరు పుష్కలంగా ఉంటే పది వేల కప్పలు అక్కడకు చేరుతాయి. నీరు ఇంకి పోగానే అవి సరస్సును వదిలేస్తాయి. మనం ధర్మాధర్మాల విచక్షణ లేకుండా కూడబెట్టిన సంపదలు మనతో వస్తాయా?
మహాభారతంలో వామనుడితో బలి చక్రవర్తి ఇలా ఆవేదన వ్యక్తం చేస్తాడు.
చెలియే మృత్యువు? చుట్టమే యముడు? సంసేవార్థులే కింకరుల్? శిలలం చేసెనే బ్రహ్మ తన్నుదృఢమే జీవంబు? నో చెల్ల్లరే చలితం బౌట ఎరుంగకీ కపట సంసారంబు నిక్కంబుగా తలచున్ మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై !
(అయ్యో! మృత్యువు ఆప్త మిత్రుడు కాదు, యముడు దగ్గర చుట్టం కాడు. సేవకులు భక్తితో సేవించాలనుకునే బుద్ధిమంతులు కారు. ప్రాణం శాశ్వతం కాదు. బ్రహ్మ ఈ శరీరాన్ని రాళ్ళతో మలచలేదు. అయినా మూర్ఖుడు సత్యం, దానం, దయ, ధర్మం వదిలేస్తున్నాడు. ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు'. మానవీయ జీవితాన్ని మహాసముద్రంలో కొట్టుకుపోయే దుంగలతో పోలుస్తాడు వేద వ్యాసుడు. మహాసముద్రంలో కొయ్య దుంగలు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చి కొంత దూరం కలసి ప్రయా ణించి విడిపోయినట్లు ఈ భవ సాగరంలో జీవు లందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కలుసుకుని మర ల విడిపోతూ ఉంటారు. గౌతమ బుద్ధుడు ఏమి చెప్పాడో చూద్ద్దాం. 'స్వీయ సౌఖ్యం కోసం ఇతరులను బాధించ రాదు. ద్వేషరహితమైన దయార్ద్ర హృద యాన్ని, అమేయమైన కరుణను, నిస్వా ర్థమైన పరోపకార గుణాన్ని అలవరచుకోవడానికి మానవుడు ప్రయత్నిం చాలి' అని ఆయన హితవు చెప్పాడు. 'మానవ సేవే మాధవ సేవ' అని స్వామి వివేకానంద ప్రబోధించాడు.
చెట్లు ఫలాలనిస్తున్నాయి. ఆ చెట్లే ప్రాణికోటి బతకడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. మేఘుడు ఉపకార బుద్ధితో ఆకాశం నుంచి నీటిని కురిపిస్తున్నాడు. ఇవన్నీ నిస్వార్థంతో కూడినవే. మరి బుద్ధిజ్ఞానాలున్న మానవుడు ప్రకృతి నుంచి పాఠాలెందుకు నేర్చుకోడు. అందుకు కారణం స్వార్థమే. నిజం చెప్పాలంటే అన్ని కోరికలూ సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్తకొత్త సంకల్పాలు ఉద్భవించకుండా చూసుకుంటే కోరికలు క్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణంచిన కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన, తగ్గ్గుతూ వస్తాయి. దయ, కరుణ, సేవా భావం, పరోపకారం వంటి సద్గు ణాలు మనలో ఉంటే భౌతిక సుఖాల కోరికలు పరిమిత మవుతాయి. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కొం తైనా వెచ్చించాలి. మన సమాజంలో సత్కా ర్యాల కోసం దాన ధర్మాలు చేసేవారు, పరోపకార పరా యణులు చాలా మంది ఉన్నారు. అలాంటివారు మనకు మార్గ దర్శకులు కావాలి. పరోపకారానికి ధనమే ముఖ్యం కాదు.
అంగవైకల్యం ఉన్న వారికి, రోగులకు, దు:ఖితులకు, దరిద్రులకు సేవ చేయడమే పుణ్యకార్యం. సుఖ జీవనానికి అపరిమితమైన ధనం అవసరం లేదని బోధించే అం శాలు మనం వింటూనే ఉంటాం. పూర్వం టికిరీని రాజధానిగా చేసుకుని సుందర్ సింహ్ అనే రాజు పాలించేవాడు. అతని రాజధానికి చాల దూరంలో ఒక దేవాలయం ఉండేది. మందిరంలో గౌరీబాయి అనే యోగిని ఉండేది. ఈశ్వరుని అర్చించిన తర్వాత ఆమె గ్రామస్థులకు సహాయం చేసేది. గ్రామస్థులు కూడా ఆమెను గౌరవంగా చూసేవారు. ప్రేమగా గౌరీమాతా అని సంబోధిం చేవారు. ఆమె నిస్సహాయులకు నిస్వార్థంగా సేవ చేస్తోందని రాజుకు తెలిసింది. అతడామెను చూడాలని వచ్చాడు. ఆమెకు ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. వెంటనే వెయ్యి బంగారు ముద్రలామెకిచ్చాడు. ఆమె నిరాకరించింది. పరోపకార పరాయణులైన మీరు ఇంత దుర్భర దారిద్య్రంలో ఉండడం నేను చూడలేను. దయచేసి ఈ ధనం స్వీకరించండని బలవంతపెట్టాడు. 'రాజా నా గురించి ఆలోచించకండి. ఇక్కడ ఎందరో దుఖితులు, దీనులు, దరిద్రులు, రోగులు ఉన్నారు. వారికి సేవచేయడం నా ధర్మం. ఈ చుట్టుపక్కల పలు గ్రామా లవారు నా బాగోగులు చూస్తున్నారు. మరి నేను దుర్భర దారిద్య్రం అనుభవిసున్నానని మీరు ఎందుకు అనుకోవాలి. నాకు సంపదల మీద ఈషణ్మాత్రం కోరికలేదు' అంది ఆమె. 'అయితే డబ్బు అవసరం నా కన్న వీరికే ఎక్కువ. ఈ స్వర్ణముద్రలు మీరు నాకు ఇచ్చారు. అందువల్ల వాటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. నేను ఈ ప్రజల కష్టాలను దూరం చేయాలనుకుంటున్నాను. వారు సుఖంగా ఉంటేనే నేను సుఖంగా ఉం డగలను. ఈ స్వర్ణముద్రలను వీరిలో అవి అవసరమైన వారికిస్తాను. ఈ స్వర్ణ ముద్రికలు సరైన చోటకు వెళ్లడమేనాకానందం' అంది గౌరీమాత. సంపదల పట్ల ఆమెకున్న విముఖతకు రాజు ఆశ్చర్యపోయాడు. మన చుట్టూ ఎంతో మంది దు:ఖితులు, దరిద్రులు ఉండి వారు కష్ట్టపడుతూ ఉంటే మనం వృధాగా ధనాన్ని విలాసాలకు ఖర్చు పెట్ట్టడం పాపం. ఆ ధనంతో నలుగురైదు గురి కష్టాలు తొల గించగలిగితే అంతకన్నా పుణ్య కార్యం వేరే ఉండదు. పరోపకారాన్ని మించిన ధర్మం వేరొకటి ఉండదు.
Comments