మహోన్నతుడు భీష్ముడు
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
భీష్ముడు అష్టవసువుల్లో ఒకరు. బ్రహ్మ శాపం వల్ల్ల అతను శంతన మహారాజుకు కుమారునిగా జన్మించాడు. అతని తల్లి గంగా దేవి. అతను తండ్రి కోసం, ఆయన సత్యవతీదేవిని వివాహం చేసుకోవడం కోసం ఆమె తండ్రి దాశరాజు విధించిన షరతులకు కట్టుబడ్డాడు. వివాహం చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. చివరకు కురు వంశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడినా, సత్యవతీదేవి కోరి, ఒత్తిడి తెచ్చినా తన ప్రతిజ్ఞను మాత్రం వీడలేదు. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్ట్టుబడి ఉన్నాడు. కనుకే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది.
మహాభారతంలోని పాత్ర లలో కెల్లా గొప్ప పాత్ర ఏదంటే అవతార పురుషుడైన కృష్ణుణ్ని తప్పిస్తే భీ ష్ముడే అని చెప్పవచ్చు. భీష్ముడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ధర్మాత్ముడు, సత్యనిష్ఠ కలవాడు, అద్వితీయమైన పితృభక్తి కలవాడు, వీరత్వంలో అతనికి అతనే సాటి. అవక్ర పరాక్రమ శాలి, సాక్షాత్తు అవతార పురుషుడు అతని గురువు అయిన పరశురాముడే భీష్ముణ్ని యుద్ధంలో ఓడించలేక పోయాడు. తండ్రి నుంచి ఇచ్ఛామరణం వరం పొందాడు.
ఆయన ధర్మవర్తనుడు, సత్య నిష్ఠా గరిష్ఠుడు కనుకనే ఎల్లవేళలా విజయలక్ష్మి ఆయనను విడవకుండా ఉండేది. ఒక వేళ వ్యక్తిగతంగా నీతిమంతులు కాకపోతే ఆ విధంగా జయ కేతనం ఎగురవేయడం చాలా కష్టం.
భీష్ముడు అష్టవసువుల్లో ఒకరు. బ్రహ్మ శాపం వల్ల అతను శంతన మహారాజుకు కుమారునిగా జన్మించాడు. అతని తల్లి గంగా దేవి. అతను తండ్రి కోసం, ఆయన సత్యవతీ దేవిని వివాహం చేసుకోవడం కోసం ఆమె తండ్రి దాశరాజు విధించిన షరతులకు కట్టుబడ్డాడు. వివాహం చేసుకోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. చివరకు కురు వంశం అంతరించిపోయే ప్రమాదం ఏర్పడినా, సత్యవతీదేవి కోరినా తన ప్రతిజ్ఞను మాత్రం వీడలేదు.
ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. కనుకే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భీష్ముని చంప డానికి ద్రుప దుని కుమార్తెగా శిఖండి పుట్టాడు. ఒక సంద ర్భంలో భీష్ముడు తన పెళ్ళి చెడగొట్టాడని పగబట్టిన అంబ అనే రాజ కుమార్తె భీష్మునిపై పగబట్టి ఆయనను పరాభవించడానికి పరిపరి విధాల ప్రయత్నించింది. చివరకు భీష్ముని గురువు అయిన పరశురాముని సాయాన్ని కోరింది. ఆయనా వచ్చి అంబకు న్యాయం చేయమని కోరాడు. తాను అన్యాయం చేయలేదని భీష్ముడు చెప్పాడు. పరశురాముడు కోపించి యుద్ధం చేశాడు. అయినా అజేయుడైన తన శిష్యుడు భీష్ముణ్ని ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. దానితో అంబ, శివుని గూర్చి ఘోర తపస్సు చేసిి మరు జన్మలో భీష్ముని చంపగలిగే వరంతో పుట్టింది. ఆమే శిఖండి. బాలికగా పుట్టిన ఆమె మగ వానిగా మారుతుందని శివుడు చెప్పినందున ఆమెను మగ వారిగానే పెంచాడు తండ్రి ద్రుపదుడు. ఆమె మగవానిగా మారుతుందనే భరోసాతో వివాహం కూడా చేశాడు. అయితే అసలు విషయం బయటపడుతుందని అడవులలోకెళ్ళిన శిఖండి ఒక యక్షుని దయ వల్ల్ల పురుషుడయ్యాడు.
ఇదిలా ఉండగా పాండవులు మహాభారత యుద్ధ సమ యంలో భీష్ముని నిరోధించలేక ఆయన మరణించే మార్గం చెప్పమన్నారు. దానితో ఆయన అంగనాపూర్వునితో (ఆడ దానిగా పుట్టి మగవారిగా మారినవారితో) తాను యుద్ధం చేయనని తెలిపాడు. అటువంటి వాడే శిఖండి అని, అతను తనను చంపడానికే పుట్టాడని ఆయనకు తెలుసు. యుద్ధంలో భీష్మునికి ఎదురుగా శిఖండిని పంపి ఆయన యుద్ధ విము ఖుడై ఉన్న సమయంలో అర్జునుడు, శిఖండి ఆయనపై బాణ వర్షం కురిపిం చారు. నిజానికి అర్జునుని బాణాలకే భీష్ముడు నేల కూలాడు. తన మరణానికి కారణ మయ్యాడని ఆయన శి ఖండిని తప్పుపట్టలేదు. అంప శయ్యపై ఉం డి స్వచ్ఛంద మరణ వరం ఉన్నం దున ఉత్తరాయన పుణ్య కాలం వరకూ వేచి ఉన్నాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుని దివ్య అనుగ్రహంతో విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. అలాగే లెక్కలేనన్ని ధర్మాలు బోధిం చాడు. ఉత్తరాయన పుణ్యకాలం ఆసన్నమయ్యాక శ్రీకృష్ణుని చిరునగవుల మోమును చూస్తూ ఆయనలో లీనమయ్యాడు.
తన మరణం ఎవరి వల్లనో తెలిసి కూడా వారికే విద్య నేర్పిన మరో మహానుభావుడు కూడా మహాభా రతంలో ఉన్నాడు. ఆయనే ద్రోణుడు. ద్రోణుడి మీద కోపంతో ద్రుపద మహా రాజు ద్రోణుణ్ని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు. అలా పుట్ట్టిన వాడే పాండవ సేనాని ధృష్టద్యుమ్నుడు. అతడు తనను చంపడానికి పుట్టాడని తెలిసినా అతనికి అందరితో సమానంగా యుద్ధవిద్యలు నేర్పించి, ఆచార్య ధర్మాన్ని అక్షరాలా పాటించాడు ద్రోణుడు. తమను చంపడానికి పుట్టిన వారు ఎవరో తెలిసినా తమ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం బెసగని మహోన్నతులు మహాభారతంతో మనకు కనిపిస్తారు.
Comments