వివేకి ఎవరు.?
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
వివేకవంతుడు తన ధ్యేయానికి ఆటంకం కలిగించే క్రోధం, గర్వం, ధూర్త వినయం, డాంబికం వంటివి వదలాలి. అతని చర్యలు ఎప్పుడూ ఇహ పర లోకాలకు ప్రయోజనకారిగా ఉండాలి. నిస్వార్థంగా ఉండాలి. మంచిని ప్రేమించడం, ఇతరులకు సంతోషాన్నివ్వ గలవాడుగా ఉండాలి. మానావమానాలకు అతీతంగా ఉండి మనస్సు ప్రశాంతంగా, చల్లగా, నిర్మలంగా ఉండాలి.
మహాభారతం ధర్మానికి ఖజానా వంటిది. శాంతి, అనుశాసనిక పర్వాల్లో ఎ న్నో ధర్మ శాస్త్ర విషయాలు ఉన్నాయి. దానికి ముందుగా ఉద్యోగపర్వంలో ధృతరాష్ట్రుడు అడగ్గా విదురుడు తెలిపిన ధర్మం (నీతి) కూడా ధర్మ శాస్త్రపరంగా ఒక ఆణిముత్యంగా ఎన్నదగినది. అదే విదుర నీతిగా ప్రఖ్యాతమయింది. ఆధునిక కాలంలో మానవులు తెలుసుకుని ఆచరించా ల్సిన ధర్మాలను గుణవంతుడు, మేధావి, ధర్మపరుడు అయిన విదురుడు వివరించాడు. దానిలో వివేకవంతుడు ఎలా ఉండాలో ఆయన ఈ విధంగా తెలిపాడు.
మానవుడు తన జీవితంలో ఉత్తమ ఆశయాలు కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం, సాధన, ఓరిమి, శాంతి, స్థిర బుద్ధి, వివేకవంతుని సొత్తుగా ఉండాలి.
వివేకవంతుడు తన ధ్యేయానికి ఆటంకం కలిగించే క్రోధం, గర్వం, ధూర్త వినయం, డాంబికం వంటివి వదలాలి. అతని చర్యలు ఎప్పుడూ ఇహపర లోకాలకు ప్రయోజనకారిగా ఉండాలి. నిస్వార్థంగా ఉండాలి. మంచిని ప్రేమించడం, ఇతరులకు సంతోషాన్నివ్వ గలవాడుగా ఉండాలి. మానావమానాలకు అతీతంగా ఉండి మనస్సు ప్రశాంతంగా, చల్లగా, నిర్మలంగా ఉండాలి.
మంచి చెడు విచక్షణ కలిగి ఉండాలి. వివేక వంతుడైనవాడు స్నేహితు లతో తగవులాడడు. నీచులతో సాంగత్యం పెట్ట్టుకోడు. అహంకారంతో నీచంగా ప్రవర్తించడు. పరుషంగా మాట్లాడడు. సామ, దాన, భేద, దండోపాయాలతో శత్రువులను, మిత్రులను, అపరిచితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు.
ధర్మాన్ని మించిన ఉత్తమ గుణం లేదు. క్షమాగుణమే పరమ శాంతి. సంతృప్తియే జ్ఞానం ,పరమ సౌఖ్యమే ఔదార్యం. కామ క్రోధ లోభాలు ఆత్మ వినాశనానికి దారితీస్తాయి. ఇవి వివేకవంతునికి బాగా తెలిసి ఉంటాయి. స్త్రీలోలత్వం, వేట జూదం, పరుష ప్రసంగం, మద్యం, సంపద దుర్వినియోగం వీటికి వి వేకవంతుడు దూరంగా ఉండాలి. తల్లి, తండ్రి, గురువు, అగ్ని ఈ ఐదింటిని పూజించాలి.
అతి ప్రమాదకరమైన మూడు నేరాలకు అతను దూరంగా ఉంటాడు. ఆ మూడు నేరాలు పరుల సొత్త్తు దొంగిలించడం, స్త్రీలపై అత్యాచారం, మిత్ర ద్రోహం.
ఈ శరీ రం ఒక రథం, అంతరాత్మ రథ సారథి. ఇంద్రియాలు అశ్వాలు, శిక్షణ పొందిన అశ్వాలు రథాన్ని లాగుకొని వెళ్ళేప్పుడు వివేకవంతుడు, సుఖంగా, ప్రశాం తంగా, జీవిత ప్రయాణం సాగిస్తాడు. కాని క్రమశిక్షణలేని అశ్వాలు తమకు తోచిన రీతిలో సారథికి లొంగక రథాన్ని ఈడ్చుకువెడితే అది ఆ రథం వినాశనానికి దారితీస్తుంది. దుష్ట చిత్తం కలవారు ఇంద్రియాలకు దాసులై చేసిన పనుల కారణంగా పతనం చెందుతారు.
మోసం చేసే వానిని పాపం నుంచి వేదాలు రక్షించవు. నీతిగా, ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఫలిస్తాయి. ' త్యాగం, అధ్యయనం, వైరాగ్యం, దానం, సత్యం, క్షమ, కరుణ, సంతృప్తి అనేవి ఎనిమిది ధర్మమార్గాలు. వీటిని అభ్యసిించాలి. ఇవి గొప్ప వారిలో మాత్రమే ఉంటాయి.
వివేకవంతుని ఆలోచన రాత్రి పూట సుఖంగా ఉండేదుకు ఏది తోడ్పడుతుందో దానిని పగటి సమయంలో చేయాలి. వృద్ధాప్యంలో సుఖంగా ఉండేందుకు ఏది చేయాలో అది యౌవనంలో చేయాలి. జీవితానంతరం సుఖంగా ఉండేందుకు ఏది అవసరమో అది జీవిత కాలంలో చేయాలి.
మూర్ఖుని గుణాలు. ధర్మ శాస్త్ర నియమాలను మూర్ఖులు ఆచరించడు. డాంబికం, దర్పం, అహంకారం, గర్వం అతని సొత్త్తు. దేనినైనా పొందేందుకు అన్యాయ మార్గం అనుసరించడానికైనా వెనుకాడడు అధికారం, అర్హత లేని కొర్కెలను కోరుటలో చాకచక్యం ప్రదర్శిస్తాడు శక్తిమంతులైన వారిని చూసి అసూయ చెందుతాడు. మూర్ఖుడు తాను చేసిిన పాపాల ఫలం తన శ్రేయోభిలాషులు కూడా భరించేలా చేస్తాడు. కోర్కెలు లేకుండుటను మించిన పుణ్యం లేదు. కామరహితుడైన జీవుడు పరమ పవిత్రుడు. మృతి చెందిన జీవుని తో బాటు పరలోకానికి వెళ్లేవి రెండే. అవే పాప పుణ్యాలు. మృతి చెందిన మాన వుని అతని కర్మ ఫలాలు మాత్రమే అనుసరిస్తాయి. అందువలన మానవులు నిదానంగా, జాగ్రత్తగా, ధర్మదేవత మెప్పు సంపాదించాలి. వివేకవంతునిగా ఉండాలి.
Comentarios