సృష్టి సహకారానికి పంచావతారమూర్తులు
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
విష్ణుమూర్తి లోకకళ్యాణార్థం ఎన్నో అవతారాలు ధరించిన విష యం మనకు తెలిసిందే. అదేవిధంగా పరమ శివుడు కూడా పలు అవతారాలు దాల్చాడు. వాటిలో బ్రహ్మ కోరికపై దాల్చినవి ఐదు. ఈశ్వరుడు త్రిలోచనుడు, త్రిశూలి, ధవళ శరీ రుడు అని మనకు తెలుసు. ఆయన తెల్లటి శరీరం కలవాడని, ఘన సార గౌర గాత్రం(కర్పూరం వలె తెల్లని శరీరం కలవాడని) వర్ణనలు ఉన్నాయి. అమృత మథనం సమయంలో గరళాన్ని తాగి కంఠంలో ఉంచుకున్నందున గరళ కంఠుడు, నీల కంఠుడు అయ్యాడని, తద్వారా ఆయన కంఠం మాత్రమే నీలి, నలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం. కాని బ్రహ్మ కోరికపై శివుడు ఐదు అవతారాలు ధరించాడు. ఆయా అవతారాల్లో ఆయన రకరకాల రంగుల్లో ప్రత్యక్ష మయ్యారు. ఈశ్వరుని ఐదు ముఖాలైన సద్యోజాత, వామ దేవ, తత్పురుష, అఘోర, ఈశాన ముఖాలు ఆయా అవతారాలకు సంబంధించినవే. ఈ ఐదు అవతారాల రేఖామాత్ర వివర ణ ఈ విధంగా తెలుసుకోవచ్చు.
బ్రహ్మ శ్వేతవరాహ కల్పంలో పరమేశ్వరుని ధ్యానించి తన విధులను నిర్వ ర్తించడానికి త గిన జ్ఞానాన్ని, నలు గురు కుమారులను ప్రసాదించమని శివుణ్ని ప్రార్థించాడు. బ్రహ్మకు, తన విధి నిర్వహ ణకు కోరిన కోరికను తీర్చేందుకు వెంటనే ప్రత్యక్షమ య్యాడు పరమేశ్వరుడు. ఆయన ఆ సందర్భంలో గౌరీ దేవితో కూడి సద్యోజాత శివ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రహ్మకు జ్ఞాన భిక్షతో పాటు నలుగురు కుమారులను అనుగ్రహించాడు. వారే సునందుడు, నందనుడు, విశ్వ నందనుడు, ఉపనందుడు.
రక్త కల్పంలో బ్రహ్మదేవుడు పరమ శివుడిని ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్లతోను, కెం పు రంగు శరీరంతోను, రక్త వర్ణవస్త్ర భూషణాలను ధరించడమే కాకుండా, అగ్ని గోళాల వంటి ఎర్రని కళ్ళతో ప్రశాంత వదనంతో ప్రత్యక్షమై జ్ఞాన భిక్షతో పాటు ఎర్రటి వస్త్రాదులను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించాడు. వారే విరజుడు, వివాహుడు, విశోకుడు, విశ్వ భావనుడు. శివుని ఈ రూపమే వామదేవావతారం.
ఆ తరువాత పీతవాస కల్పంలోనూ బ్రహ్మ, శివుణ్ని ధ్యానించాడు. ఆయన పసుపు వర్ణ వస్త్రాలను ధరించి బంగారు వర్ణంతో భుజ బలంతో ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు. అదే మూడవ అవతారమైన తత్పురుషావతారం.
ఆ తర్వాత వచ్చిన కల్పం శివ కల్పం. ఈ కల్పం ఆదిలో సర్వం జలమయంగా ఉంది. ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ అనంత జలరాశిలో సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలనేది బ్రహ్మకు పెద్ద సమస్య అయి కూచుంది. ఏ మార్గం తోచక శివుని ధ్యానించాడు బ్రహ్మ. పరమేశ్వరుడు నల్లటి శరీర ఛాయతో అందులోను ఒక దివ్యతేజస్సుతో అఘోరమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. దానితో బ్రహ్మ తనకు సృష్టి కార్యంలో సహకారులుగా కొందరిని అనుగ్రహించమని కోరాడు. దానితో నల్లని దేహం, నల్ల్లని ముఖం, నల్లని శిఖ కలిగిన నలు గురిని సృష్టించి, వారిని బ్రహ్మకు ఇచ్చాడు. ఆ నలుగురు బ్రహ్మ సృష్టికి ఎంతగానో తోడ్పడ్డారు. మరో కల్పంలో బ్రహ్మకు సృష్టి కార్య నిర్వహణలో సమస్య ఎదురైంది. దానిని గ్రహించిన పరమశివుడు బ్రహ్మ శరీరం నుంచే ఈశానావతారంగా అవతరించాడు. ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారాల కంటె విశిష్టమైనది. ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేశాడు. వారే జటి, ముండి, శిఖండి, అర్థముండీలు. ఇలా ఐదు సందర్భాల్లో, ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ తలపెట్టిన సృష్టి నిర్మాణ కార్యానికి , ముల్లోకాల హితానికి ముక్కంటి ఈ అవతారాలు ఎత్తినట్లు శర రుద్ర సంహిత పేర్కొంటోందన్నది పెద్దల మాట.
Comments