సమన్యాయమే సన్యాసం
- B Ashok Kumar
- Jun 5, 2018
- 2 min read
ప్రపంచంలో జరుగుతున్న అన్నిటికీ కర్త ఉన్నాడన్న నమ్మకం స్థిరమైతేనే అకర్తృత్వం కలుగుతుంది. అది జరిగిన నాడు అహంకారం ఉండదు. అహం తొలగితే ఆత్మ భావన కలగటం మొదలవుతుంది. మనసు సమన్యాసంగా తన సంచారాన్ని సాగిస్తుంది.
సనాతన ధర్మం ముఖ్యంగా నాలుగు ఆశ్రమాలను పేర్కొంది. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. సన్యాసాశ్రమం వీటిలో చివరిది. కొన్నిటిని వదిలిపెట్ట్టి, కొన్నిటిని అంటిపెట్టుకుని, ఇంకొన్నిటిని వంట పట్టించుకుని, గిరి గీసుకుని, పరిధులకు పరిమితమై, ఎవరినీ పట్టించుకోనిది సన్యాసం కాదు. ఇటు లోకాన్ని, అటు లోకాతీతమైన దానిని సమన్వయం చేసుకుంటూ దేహాన్ని, మనసును, ఆత్మను, ఒకే రీతిలో అనుభవిస్త్తూ, పరిమిత అవసరాలతో అపరిమిత ఆనంద విహార యాత్రగా జీవితాన్ని అవిప్కరిం చటం సన్యాసం. అన్ని అవస్థలలోనూ, స్థితులలోనూ, మనసును పరబ్రహ్మ భావనతో అనుసంధానం చేసి, ఆనందాన్ని అనుభవిస్తూ, జీవితాన్ని ఆదర్శ ప్రాయంగా జీవిస్తూ మరొకరికి స్ఫూర్తిని కలిగించగలగడం సన్యాసం. మనో వైకల్యం నుంచీ కైవల్య స్థాయికి ప్రపంచాన్ని నడిపించగలగటం సన్యాసం.
బోధ గురువులు ఒక వైపు ప్రబోధ భేరి మోగిస్తూ, లోక గురువులు లౌకిక జీవితాన్ని అవిష్కరిస్తూ, సూచక గురువులు సూచనలిస్తూ. మోచక గురువులు మోక్ష మార్గాన్ని తెరుస్తూ, వాచక గురువులు విజ్ఞానాన్ని పరుస్తూ నిషిద్ధ గురువులు విధి విధానాలను తెలియపరుస్తూ, సమాజాన్ని ఆక్రమిస్తూ, ప్రయాణంలో లెక్కలేనన్ని కూడళ్లను ఆవిష్కరిస్తున్న వేళ, మనిషి బతుక్కి కారణం, పర మార్థం, ఎరుకపరచగల స్థితప్రజ్ఞామూర్తే సన్యాసి. నమ్మకం మనం ధరించే వస్త్రం వంటిది కాదు. నమ్మకమంటే చెద రని స్థిర భావన. ప్రాపం చికమైన నమ్మకాలన్నీ అవసరాల చుట్టూ అల్లుకునేవే. అవి కాలగమనంలో మారు తుంటాయి. నమ్మకానికి అమ్మకం అంటుకోకూడదు. ప్రపంచంలో జరుగు తున్న అన్నిటికీ కర్త ఉన్నాడన్న నమ్మకం స్థిరమైతేనే అకర్తృత్వం కలుగుతుంది. అది జరిగిన నాడు అహంకారం ఉండదు. అహం తొలగితే ఆత్మ భావన కలగటం మొదలవుతుంది. మనసు సమన్యాసంగా తన సంచారాన్ని సాగిస్తుంది. శంకర భగవ త్పాదుల స్థితిని, భగవాన్ రమణుల అత్మానుభవాన్ని, బుద్ధుడి అన్వేషణని, వీరందరి కంటే ముందు యోగేశ్వర కృష్ణుడి మహాయోగా చార్యతను, ఆయన కంటే ముందరి శ్రీరామచంద్రుని మనస్సన్యాసాన్ని అధ్యయనం చేస్తే, కర్త ఆజ్ఞను పాటించటమెలాగో, పాటిస్తే ఎలా ఉంటుందో జీవితం ఎంతగా పరిపూర్ణ స్థితిని సంతరించుకుంటుందో స్పష్టమౌతుంది. సన్యాసమంటే దేనినో వదులుకోవడం మాత్రమే కాదు దేనినీ పట్టుకోకపోవడం కూడా! అది మనస్సన్యాసం. ఎవరి జీవితమైనా నదీ సదృశం. అన్నిటిని కలుపుకుపోవటం దాని లక్ష్యం, లక్షణం, గుణం. మధుర జలా లతో కూడిన నదులన్నీ దానితో సంగమించినా తన సహజ గుణమైన ఉప్పదనాన్ని కోల్పోని స్థితి సముద్రానిది. వేదాంతాన్ని అనుష్ఠానపూర్వంగా బోధించినా, వేదనను, నిర్వేదాన్ని సమంగా స్వీకరించినా, కులభేదం పాటించక మానవతను దర్శించినా, శబ్దజాలం వదలి అంతరార్థ, పరమార్థ బోధనలతో హృదయ భాషను వినిపించినా, ప్రజ్ఞానం బ్రహ్మైతే అజ్ఞానం బ్రహ్మ కాదా, అని సూత్రీ కరించినా, మనసు దైవమైనపుడు, అది చేసే మననంలో నుంచి పుట్ట్టిన మంత్రం మాత్రం దైవం కాదా అన్నా, మంత్రాక్షరాలన్నీ దైవం తాలూకు అక్షర రూపాలన్న మహా పరి సత్యాన్ని విశదం చేసినా, బ్రహ్మ దైవమైతే యముడు దైవం కాడా అని ప్రశ్నించినా, గృహిణిగా స్త్రీ సాగించేదీ, సాధించేది సమన్యాసమే. తామరాకు మీద నీటి బొట్టు, బిందువును నిలుపుకున్న ఆకు ఎంతగా పర స్పరం అంటించుకోకుండా ఉండగలిగితే అది సన్యాసం.
తామరాకు మీద నీటి బొట్టు ఆకును తడుపుతూ, దానిని శుభ్రపరుస్తూ, మెత్త్త పరుస్తూ తాంబూల నిర్మాణంలో తాను ఒకటై నమలబడి, నులమబడి, అస్తిత్వాన్ని కోల్పోయి చివరకు తూష్ణీకరింపబడితే అది ఏమి స్థితి? సర్వ సమన్వయ భావనే సన్యాసం!
Comments