top of page
  • Black Facebook Icon
  • Black YouTube Icon
  • Black Instagram Icon
  • Black Pinterest Icon

సహనమే శక్తి

  • Writer: B Ashok Kumar
    B Ashok Kumar
  • Jun 5, 2018
  • 2 min read


రామ కథ, కృష్ణ గాథ, ద్రౌపది వ్యధ దేనిని బోధిస్తున్నాయి? పరిస్థితులెన్ని ఉన్నా, ఎంత దుస్సహంగా ఉన్నా సహనంగా ఉండాలని, ఉండమని!. ఆ సహనమూ సహజంగా ఉండాలి. ఏదైనా చేయటం సహజం. చేయవలసి రావటం అసహజం.


సహన శక్తి చాలా గొప్పది. మహర్షులు, అవతార పురుషులు, సాధ్వీమణులు, ఇలా ఎందరెందరో సహన శక్తిని ప్రదర్శించి ఆ మార్గంలో నడవమని ఉద్బోధించారు. పట్టాభిషిక్తుడు కాబోయే సమయంలో పద్నాలుగేళ్ళు అరణ్య వాసానికి వెళ్లవలసి వస్తే శ్రీరాముడు వహించింది సహనం. సీతాపహరణ అనంతరం రాముడు భరించినదంతా సహనమే. కొన్ని సందర్భాలలో, తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనను ఎన్నో విధాల దూషించినా కృష్ణుడు ప్రదర్శించిం దంతా సహనమే. తన కొడుకులందరినీ అశ్వత్థామ వధించినపుడు, పుత్ర శోకాన్ని దిగమింగుకుని 'అశ్వత్థామా! నీవు గురు పుత్రుడివి, నీ తల్లి ఇప్పటికే భర్త ద్రోణుణ్ని పోగొట్టుకుని విషాదంలో ఉన్నది. నిన్ను అర్జునుడు చంపితే నీ తల్లికి కలిగే గర్భ శోకాన్ని ఊహించు' అంటున్న క్షణాన ద్రౌపది, రూపు కట్టిన సహనమే! సందర్భాలు, వ్యక్తులు వేరైనా సహనం నిలవటానికి అవకాశంలేని దుర్భర సం ఘటనలివి. రామ కథ, కృష్ణ గాథ, ద్రౌపది వ్యధ దేనిని బోధిస్తున్నాయి? పరిస్థితులెన్ని ఉన్నా, ఎంత దుస్స హంగా ఉన్నా సహనంగా ఉండాలని, ఉండమని!. ఆ సహనమూ సహజంగా ఉండాలి. ఏదైనా చేయటం సహజం. చేయవలసి రావటం అసహజం.

సర్వ సృష్టినీ నడిపించే శక్తి, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుం టుంది. ఏ ఒక్కరికో అనుకూలం, ఆనందం కలిగించేలా ఎండ కాయదు. వాన కురవదు. అన్ని వైరుధ్యాల మధ్య, ఆశ నిరాశల మధ్య ప్రమోద ప్రమాదాల మధ ్య, సుఖదు:ఖాల మధ్య, కాలం తన గతిని మార్చుకోదు. ఎవరినీ అపేక్షించదు, ఉపేక్షించదు. కనుక మానవుడు సహనాన్ని సహజ లక్షణం చేసుకోవాలి. ఎన్ని ఒత్తిళ్ళు ఏర్పడినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎంత కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చినా సహనాన్ని కోల్పోకూడదు. సహనం కోల్పోతే హననం తప్పదు. సహనం ఒకరు నేర్పితే వచ్చేది కాదు. ఎవరైతే దేనికీ లొంగక, పొంగక, కుంగక స్థిమితంగా ఉంటారో వారి బలమంతా సహనంలోనే ఉంటుంది. సహించేదంతా సహనమే. దున్నినా, తన్నినా, తవ్వినా తన నుండి ప్రేమను జీవుడికి ఆహార ఐశ్వర్య రూపంలో ఇచ్చే భూమాతది సహజ సహనమే. గృహస్థ జీవితంలో ఉంటూ ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్న వారినీ, సంఘ సంస్కర్తలనూ, మేధావులను, నూతన భావ జాలంతో ప్రపంచ గతిని ప్రభావితం చేసిన వారిని ఏ సమాజమూ అంత సులభంగా అంగీకరించలేదు. గౌరవించలేదు. వేధించకుండా వదలిపెట్టింది లేదు. వారిని పరీక్షిస్తూ నిత్య పరివేదనకు గురి చేస్తున్నా, మహాత్ములు తమ సహనాన్ని వీడలేదు. సహనంతో అన్నిటిని భరించటం తమ సహజ లక్షణం చేసుకున్నారు. కాలికి తగిలించుకున్న చెప్పులు మనకు నొప్పి కలగకుండా సహన శక్తిని నిరూపిస్తూనే ఉన్నాయి. ఎవరైనా పొగిడినా పొంగక, తెగడినా ఉద్రకం చెందక, పురస్కార, తిరస్కార, నమస్కారాలకు అతీతంగా తమ సహజ గుణానికి అనుగుణంగా ఉండగలగటం సహజ సహనమే. 'మనం చేయగలిగినది, ఆపగలిగినది మన చేతుల్లో లేనపుడు నిర్లిప్తంగా, నిస్సహాయంగా ఉండే కంటే సహజ సహనంతో ఉండగలిగితే, అన్నీ సానుకూలమౌతాయ్‌ కదా! అసహనంతో కోల్పోయే కంటే సహనంతో నిలుపుకోవటం గౌరవం కదా! సాధ్యమే కదా!

సహజ సమాధిలో ఒక వ్యక్తి తనను తాను నిలబెట్టుకోగలడు. దానివల్ల్ల అతనికి మాత్రమే లాభం. సహజ సహనంలో ఉండగలిగిత అతడికీ సమాజానికీ లాభం. అనేక దుష్పరిణామాలు జరగకుండా సహనం అడ్డుకోగలదు. ఇదంతా అనుకోటానికి బాగుంది. ఉండగలమా అనుకునే వారికి, అమ్మ ఉదాహరణగా ఉండనే ఉన్నది.

Commentaires


PAGE VIEWS

JOIN MY MAILING LIST

Copyright © 2018 AADHYATMIKAM. All rights reserved.

bottom of page